Telangana: ఉపాధిలో తెలంగాణకు రెండోస్థానం

జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు నిర్దేశిత లక్ష్యానికి మించి పనిదినాల కల్పనతో తెలంగాణ దేశంలోనే రెండోస్థానాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది.

New Update
Telangana: ఉపాధిలో తెలంగాణకు రెండోస్థానం

Telangana:తెలంగాణ మరో రికార్డును నెలకొల్పింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు నిర్దేశిత లక్ష్యానికి మించి పనిదినాల కల్పనతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండోస్థానాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ వివరాలను విడుదల చేసింది.

ALSO READ: మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ కు దక్కని ఊరట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తర్వాత స్థానాల్లో ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, బిహార్‌ రాష్ట్రాలు ఉన్నాయి. ఏప్రిల్‌ నెలలో తెలంగాణలో ఉపాధి కూలీలకు 2.25 కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉండగా... 3.29 కోట్ల పని దినాలను కల్పించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఏప్రిల్‌ 1 నుంచి మే 15వ తేదీ వరకు తీసుకుంటే 4.49 కోట్ల పని దినాలను కల్పించినట్లు తెలిపింది. ఇదే కాలవ్యవధిలో ఏపీలో 6.99 కోట్ల పని దినాలను ఉపాధి కూలీలకు కల్పించినట్లు వెల్లడించింది.

2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణలో 8 కోట్ల పనిదినాలకు ఆమోదం ఉందని వివరించింది. ఇప్పటికే నాలుగున్నర కోట్ల పనిదినాలు పూర్తవటంతో ఏడాది మొత్తంలో అధికారులు ఇలాగే లక్ష్యానికి మించి పనులు కల్పిస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదంతా ఇదే తరహాలో అత్యధిక పనిదినాలు కల్పించాలని కూలీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు