BREAKING: తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల!

2024లో జరగనున్న తెలంగాణ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 18నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్ కోసం మొత్తం ఆర్టికల్ ను చదవండి.

BREAKING: తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల!
New Update

Telangana SSC Exams: 2024లో జరగనున్న తెలంగాణ టెన్త్‌ పరీక్షల(Telangana 10th Exams) షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 18నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

Telangana SSC Exams  

యాక్షన్ ప్లాన్ అమలకు రంగం సిద్ధం

ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, మార్చి 18న మొదటి భాషతో పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రధాన పరీక్షలు మార్చి 30న సోషల్ స్టడీస్ పేపర్‌తో ముగుస్తాయి. అయితే OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, ఒకేషనల్ కోర్సు (థియరీ)తో ఏప్రిల్‌ 1న జరగుతుంది. OSSC ప్రధాన భాషా పేపర్-II ఏప్రిల్ 2న జరుగుతుంది. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఫిజికల్‌, బయోలాజికల్‌ సైన్స్‌ పేపర్లు మినహా పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. ఇప్పటివరకు 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ ప్రణాళికతో 'లక్ష' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జనవరి 10లోగా సిలబస్‌ను పూర్తిచేయాలి.ఇప్పటికే ఈ నెలలో ప్రత్యేక తరగతులు ప్రారంభం అవగా.. వచ్చే నెల నుంచి పరీక్షల వరకు తరగతుల వ్యవధిని పెంచనున్నారు.

అటు విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి, భారం తగ్గించేందుకు ప్రత్యేక తరగతులతో పాటు కౌన్సెలింగ్‌లు, ప్రేరణ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు, కీలక సమాచారాన్ని అందించడానికి వాట్సాప్ గ్రూపులు ఇప్పటికే ఉన్నాయి.

Also Read: ఒక బాల్, ఐదు రన్స్..కంగారూల కొత్త రికార్డ్

WATCH:

#ts-ssc-exams
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe