Telangana: రిపబ్లిక్ డే వేడుకల్లో కనువిందు చేయనున్న తెలంగాణ శకటం..థీమ్ మాములుగా లేదుగా..!

ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం కనువిందు చేయనుంది. 'జయ జయహే తెలంగాణ' అనే పేరు శకటానికి పెట్టారు. దాదాపు మూడేళ్ల తర్వాత తెలంగాణ గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు రాబోతుండటంతో థీమ్ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Telangana: రిపబ్లిక్ డే వేడుకల్లో కనువిందు చేయనున్న తెలంగాణ శకటం..థీమ్ మాములుగా లేదుగా..!
New Update

Telangana: ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు తెలంగాణ కనువిందు చేసేందుకు సిద్ధమవుతుంది. దాదాపు మూడేళ్ల తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ తీసుకోవడంతో తెలంగాణ శకటం గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు రాబోతోంది. 'జయ జయహే తెలంగాణ' అని శకటానికి పేరు పెట్టారు. ప్రజాకవి అందెశ్రీ రాసిన ఈ పాట తెలంగాణ ఉద్యమం సమయంలో మరింత జోష్ నింపింది. సుమారు మూడేళ్ల తర్వాత తెలంగాణ శకటం గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు రాబోతుండటంతో థీమ్ కూడా ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

Also Read: పొరపాటున ఫస్ట్‌నైట్‌ వీడియో లీక్‌..సోషల్‌ మీడియాలో వైరల్‌

publive-image

Also Read: టీడీపీ లోకి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి?

ఈనెల 26న ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్తవ్య్‌పథ్‌లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా తెలంగాణ శకటాన్ని ప్రదర్శించబోతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కేవలం 2015, 2020 సంవత్సరాల్లో మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొంది. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోరాటం.. దేశ ప్రజాస్వామ పరిరక్షణలో భాగమనే చరిత్రను శకటం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

publive-image

ఉద్యమ నేపథ్యం నుంచి అభివృద్ధి వైపు తెలంగాణ ఎలా అడుగులు వేస్తుందో కూడా శకటం ద్వారా సర్కారు చూపించనున్నారు. ఆనాటి నిరంకుశ పాలన, తెలంగాణ ఆడ బిడ్డలకు జరిగిన అవమానాల గాథల నుంచి స్వరాష్ట్రం కోసం పుట్టిన ఉద్యమ తీరును దేశ ప్రజల కళ్లకు కట్టేలా తెలంగాణ శకటాన్ని సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. శకటంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన పోరాట యోధులైన కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఢిల్లీలో రానున్న రెండేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర శకటం ప్రదర్శన ఉండనుంది.

Also Read: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయోధ్య గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకోండి!

#telangana #telangana-shakatam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe