రేపు తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌ను ప్రకటిస్తూ AISF పిలుపు

రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యార్థి సంఘాలు రెడీ అవుతున్నాయి. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు పాఠశాల విద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం ఆరోపించింది. అలానే విద్యారంగంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే తాజాగా తెలంగాణలో రేపు బంద్‌ను ప్రకటించింది. ఈ బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు కోరారు.

New Update
రేపు తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌ను ప్రకటిస్తూ AISF పిలుపు

telangana-schools-closed-tomorrow-aisf-calls-for-schools-college-bandh-on-july-12-article1

ఇటీవల జులై 5న ఏపీ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. అదే విధంగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 12న పాఠశాలలు, ఇంటర్ కాలేజీల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ ఫీజుల దందా కొనసాగతున్నా ప్రభుత్వం మాత్రం నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులను వసూలు చేస్తున్నారని.. అక్రమంగా వసూలు చేసే ఫీజు దోపిడీల దందాను అరికట్టేందుకు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చామని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

ఏఐఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాల సమావేశం

హైదరాబాద్‌లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నాయకుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందంటూ విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి నిధులు కేటాయించకుండా.. విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందంటూ విమర్శించారు. ఫీజుల నియంత్రణ చేయాలని కోరారు.

విద్యార్ధుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

విద్యారంగంలోని ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జులై 12వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు బంద్ చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ఏపీలో సైతం ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు పూర్తి స్థాయిలో టీచర్లు లేరని.. వెంటనే నోటిఫికేషన్లు వేసి తక్షణమే టీచర్ల నియామకం చేపట్టాలని విద్యార్ధి సంఘాలు జూలై 5న స్కూల్స్ బంద్‌ను ప్రకటించాయి. తాజాగా జూలై 12న తెలంగాణ పాఠశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు