వరుణుడు సృష్టించిన ఈ రికార్డులు చూస్తే షాక్‌ అవుతారు.. జులైలో దంచిపడేశాడు!

జులైలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. గత రికార్డులను చెరిపేస్తూ ఈ జులైలో వర్షాలు కొత్త రికార్డులను సృష్టించాయి. ఈ జులైలో 435.1మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవగా.. 97.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం రికార్డయింది.

New Update
వరుణుడు సృష్టించిన ఈ రికార్డులు చూస్తే షాక్‌ అవుతారు.. జులైలో దంచిపడేశాడు!

జులై(july) ఎంట్రీ ఇవ్వకముందు ఎండలతో విలవిలలాడిపోయాం.. జూన్‌ రెండో వారంలో పడాల్సిన వర్షాలు జులై మొదటివారం వచ్చినా కురవకపోవడంతో తెగ బాధ పడ్డాం. చెప్పలంటే జులై 17వరకు తెలంగాణ(Telangana)లో ఇలాంటి పరిస్తితే ఉంది.. కానీ ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. అప్పటివరకు రిలాక్స్‌గా కనిపించిన వరుణుడు తనలోని ఉగ్రరూపాన్ని బయటకు తీశాడు. అనేక జిల్లాలపై విరుచుకుపడ్డాడు..ఊర్లకు ఊర్లను ముంచేశాడు. వారం పది రోజులు గడిచేలోపే రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. వరదల (floods) కారణంగా పదుల సంఖ్యలో ప్రాణనష్టం, కోట్లలో ఆస్తినష్టం వాటిల్లింది. ఈ పరిణామాలను ఊహించని ప్రజలు అంధకారంలో మగ్గిపోయారు.. కరెంట్ లేక.. తినడానికి తిండి లేక ఆకలితో అలమటించారు. ఇదంతా జరిగింది కేవలం 10రోజుల వ్యవధిలోనే. ఈ పది రోజుల వాన గతంలో నెలకొని ఉన్న రికార్డులను చెరిపేసింది.

ఈ జులైలో పడిన వర్షపాతం ఎంత?
జూలై 17, జూలై 28 మధ్య ఏర్పడిన రెండు అల్పపీడనాలు వర్షపాతంపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. జూలై 17న తొలి అల్పపీడనం రాష్ట్రాన్ని తాకడానికి ముందు 54 శాతం వర్షపాతం లోటు ఉండగా.. జూలై 17-28 వరకు కేవలం 11 రోజుల వ్యవధిలో, రాష్ట్రంలో 362 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే 65శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు లెక్క. ఇక తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం ఈ జులైలో 435.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం రికార్డయింది. 1951 తర్వాత తెలంగాణలో నమోదైన నాలుగో అత్యంత వర్షపాత శాతం ఇదే. 1951 జులైలో 485.9 మిల్లీమీటర్ల వర్షపాతం, 1988 జూలైలో 544.1 మిల్లీమీటర్ల వర్షపాతం, గతేడాది జులైలో 530 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది.

రాష్ట్ర చరిత్రలోనే భారీ వర్షపాతం:
తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా 24 గంటల వ్యవధిలో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది కూడా ఈ జులైలోనే. ములుగు జిల్లా (mulugu district) లక్ష్మీదేవిపేటలో 64 సెంటీమీటర్ల వర్షం కురవడం ఓ రికార్డు. గతంలో ఎప్పుడూ కూడా 24గంటల గ్యాప్‌లో ఇన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాలేదు. ఇక ఇదే కాలంలో రాష్ట్రం 97.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతాన్ని (cumulative rainfall) చూసింది. ఇది ఆల్ టైమ్ రికార్డు. అంతేకాదు TSDPS డేటా ప్రకారం, జూలై 19 నుంచి 26 వరకు హైదరాబాద్‌(hyderabad)లో 299 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. ఈ పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ జులై 17ముందు వరకు ఉన్న లోటు వర్షపాతం (rainfall) కాస్త ఇప్పుడు మిగులు వర్షపాతంగా మారిపోయింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు