Gadwal MLA: ఆ డిమాండ్‌కు నో చెప్పిన రేవంత్.. గద్వాల ఎమ్మెల్యే యూట‌ర్న్‌కు కారణమిదే?

మాజీ జడ్పీచైర్మన్ సరితాతిరుపతయ్యను పక్కన పెట్టాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు డిమాండ్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ డిమాండ్ ను పట్టించుకోకపోవడంతోనే ఆయన కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో తిరిగి చేరినట్లు సమాచారం.

New Update
Gadwal MLA: ఆ డిమాండ్‌కు నో చెప్పిన రేవంత్.. గద్వాల ఎమ్మెల్యే యూట‌ర్న్‌కు కారణమిదే?

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి తిరిగి బీఆర్ఎస్ లో చేరడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న బీఆర్ఎస్ పార్టీలో ఈ చేరిక జోష్‌ నింపింది. బండ్ల బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలు సైతం తమ పార్టీలోకి తిరిగి వస్తారంటూ బీఆర్ఎస్ లీకులు ఇస్తోంది. ఇదిలా ఉంటే.. త్వరలో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ కు ఈ పరిణామం షాక్ ఇచ్చింది. అసలు తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే మళ్లీ బీఆర్ఎస్ లోకి ఎందుకు వెళ్లాడనే చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. అయితే.. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల కారణంగానే కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Sabitha Vs Revanth: మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చాం.. కంటతడి పెట్టిన సబితారెడ్డి

మాజీ జడ్పీ చైర్ పర్సన్ తో విభేదాలు..
గద్వాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్యతో విభేదాల కారణంగానే మనసు మార్చుకున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. సరితా తిరుపతయ్య బీఆర్ఎస్ నుంచి జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ లో చేరి గద్వాల ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. అయితే..ఆ ఎన్నికల్లో కేవలం ఏడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు సరితా తిరుపతయ్య. అనంతరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఆమే చూస్తూ వస్తున్నారు.

రేవంత్ రెడ్డికి రెండు డిమాండ్లు?
ఈ క్రమంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే.. ఎంపీ మల్లు రవి, ఇతర సీనియర్లు ఆమెతో చర్చించి ఆ సమయంలో ఒప్పించారు. కానీ బండ్ల చేరిన నాటి నుంచి వీరి మధ్య తరచుగా విభేదాలు చోటు చేసుకున్నాయి. సరితా తిరుపతయ్య అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీళ్లేదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గీయులకే టికెట్లు ఇవ్వాలని బండ్ల రెండు డిమాండ్లు పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టినట్లు సమాచారం.

అయితే.. స్థానిక ఎన్నికల్లో ఆయన వర్గీయులకే టికెట్లు ఇచ్చేందుకు అంగీకరించిన నాయకత్వం మొదటి డిమాండ్ కు మాత్రం నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపానికి గురైన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరారన్న ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి: TG: ఆత్మహత్య చేసుకోను.. BRS లో చేరికపై ఎమ్మెల్యే సంచలన కామెంట్స్!

Advertisment
తాజా కథనాలు