దుమారం రేపుతున్న బీజేపీ నేత రఘునందన్‌ డిమాండ్ల చిట్టా

తెలంగాణ బీజేపీలో జితేందర్ రెడ్డి వ్యవహారం చల్లారక ముందే రఘునందన్ అక్కసును వెళ్లగక్కారు. బీజేపీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదంటూ అక్రోశం వ్యక్తం చేశారు. తనకు తగిన ప్రాధాన్యత కావాలంటూ అధిష్టానానికి స్వయంగా తానే లేఖను పంపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రోజుకో అసమ్మతి నేతలు బయటకు రావడం ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో కాక పుట్టిస్తోంది.

దుమారం రేపుతున్న బీజేపీ నేత రఘునందన్‌ డిమాండ్ల చిట్టా
New Update

telangana-politics-growing-discomfort-in-bjp-raghunandan-demands-list-before-the-leadership

తెలంగాణ బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. గురువారం జితేందర్‌ చేసిన ట్వీట్లు తీవ్ర కలకలం రేపాయి. దున్నపోతుల్ని ట్రాలీలో ఎక్కిస్తూ బీజేపీ నాయకత్వానికి అలాంటి ట్రీట్మెంట‌్ అవసరం అంటూ జితేందర్ ట్వీట్లు చేశారు. ఆ తర్వాత వాటిని డిలీట్ చేశారు. వాటిపై దుమారం రేగడంతో మళ్లీ తిరిగి వాటిిని పోస్ట్ చేసి వివరణ ఇచ్చుకున్నారు.ఆ వెంటనే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన నిరసన గళాన్ని వినిపించారు. దాదాపు రెండు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు రఘునందన్ దూరంగా ఉంటున్నారు. జితేందర్‌ రెడ్డి అసమ్మతి స్వరం వినిపించిన వెంటనే తాను కూడా పార్టీ అధిష్టానానికి అసంతృప్తి తెలియచేస్తూ లేఖను పంపించినట్లు తెలుస్తోంది.

జితేందర్‌ రెడ్డి ట్వీట్‌ చేసిన తర్వాత తెలంగాణ బీజేపీలో కలకలం రేగింది. దున్నపోతును ట్రాలీలో ఎక్కిస్తూ, బీజేపీ నాయకత్వానికి అలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమని ఆ‍యన చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసిందోనని విస్తృత చర్చ జరిగింది. అదే సమయంలో రఘునందన్ కూడా తన నిరసనను బాహాటంగా వ్యక్తం చేశారు. పార్టీలో తనకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని, ఫ్లోర్‌ లీడర్‌ అవకాశం కల్పించాలని అడుగుతున్నా పట్టించుకోవట్లేదని రఘునందన్ చెబుతున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గంలో చోటు కావాలని కోరిన స్పందించలేదని సన్నిహితులకు చెబుతున్నారు.బీజేపీ దుబ్బాకలో గెలిచిన తర్వాతే తెలంగాణలో ఆ పార్టీకి హైప్ వచ్చిందని, తెలంగాణలో పార్టీకి జోష్‌ రావడానికి తానే కారణమని రఘునందన్‌ చెబుతున్నారు.

తనను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించాలని కోరినా పట్టించుకోలేదని చెబుతున్నారు. దుబ్బాకలో బీజేపీ గెలిచిన తర్వాత పరిస్థితులు మారాయని, అందుకు కారణమైన తనకు మాత్రం బీజేపీ నాయకత్వం సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని రఘునందన్‌ రావు అసంతృప్తితో ఉన్నారు.పార్టీలోకి తన తర్వాత వచ్చిన ఈటల, రాజగోపాల్ రెడ్డి వంటి వారిని పిలిచి తరచూ మాట్లాడుతున్నారని, తనను పక్కన పెట్టి అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని రఘునందన్ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే తనను పక్కన పెట్టి ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌ లకు వై క్యాటగిరీ భద్రత కల్పించాలని కోరుతున్నారని, తన రక్షణ విషయంలో మాత్రం స్పందించడం లేదని రఘునందన్‌ చెబుతున్నారు.

పార్టీలో తనకు ప్రాధాన్యత కల్పించడం లేదంటూ రఘునందన్ ఆ పార్టీ అధిష్టానానికి లేఖలు సంధించినట్లు తెలుస్తోంది. లేఖలో రఘునందన్ రావు మూడు డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. తనకు జాతీయ అధికార ప్రతినిధి పదవిని ఇవ్వడం, జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించడం, అసెంబ్లీలో ఫ్లోర్‌ లీడర్‌ ఛాన్స్‌ ఇవ్వాలనే పలు డిమాండ్లను ప్రస్తావిస్తూ.. పార్టీ కోసం తాను పనిచేయాలంటే తన డిమాండ్లను ఖచ్చితంగా పరిశీలించాలని రఘునందన్ చెబుతున్నారు. రఘునందన్ వ్యవహారంతో బీజేపీలో ఏమి జరుగుతుందనే చర్చ మొదలైంది. మరోవైపు ధిక్కార స్వరాలను దారికి తీసుకువచ్చేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe