Telangana Politics: మేం BRSలోనే ఉంటాం.. నేడు KCRను కలిసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరే! బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి , కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, టి .ప్రకాష్ గౌడ్ తదితరులు ఈ రోజు కేసీఆర్ ను కలిశారు. తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతామని వారు అధినేతకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. By Nikhil 25 Jun 2024 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతున్నా.. ఈ ఇద్దరి పేరు మాత్రం ఎక్కడా వినిపించలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక సారి కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా, మరో సారి స్పీకర్ గా ఆయనకు అవకాశం దక్కింది. ఎన్నికల తర్వాత సైతం బీఆర్ఎస్ తరఫున అనేక వేదికలపై ఆయన తన గొంతు వినిపించారు. చాలా సార్లు కేసీఆర్ పక్కనే కనిపించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సైతం బీఆర్ఎస్ నమ్మకంగా ఉంటూ వచ్చారు. కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఆయన సన్నిహితుడున్న పేరుంది. ఇలాంటి ఇద్దరు నమ్మకంగా ఉన్న నేతలు సైలెంట్ గా జంప్ అవడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలను ఫామ్ హౌజ్ కు పలిపించుకుని మంతనాలు సాగిస్తున్నారు. బీఆర్ఎస్ కు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ ఉంటుందని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఈ రోజు ఎమ్మెల్యేలు టి. హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి , కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, టి . ప్రకాష్ గౌడ్ కేసీఆర్ ను కలిశారు. ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి , దండే విఠల్ తో పాటు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న తో పాటు క్యామ మల్లేష్ , రావుల శ్రీధర్ రెడ్డి తదితర నాయకులు కేసీఆర్ తో భేటీ అయ్యారు. #cm-kcr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి