/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/BRS-MLAS-1.jpg)
పార్టీని వీడిన ఎమ్మెల్యేలను మళ్లీ వెనక్కు రప్పించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఘర్ వాపసీ ఆపరేషన్ చేపట్టింది. ఈ రోజు ఉదయం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ నెల 7న ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. బండ్ల దారిలోనే మరికొందరు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కొద్ది సేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
దీంతో ఆయన కూడా బీఆర్ఎస్ లో తిరిగి చేరుతారన్న ప్రచారం సాగుతోంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం బీఆర్ఎస్ లో తిరిగి చేరుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం, వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా చెబుతోంది. ఈ మేరకు ఆ పార్టీ న్యాయపోరాటం సైతం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే అనర్హత వేటు పడుతుందనే భయం కారణంగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్న చర్చ సాగుతోంది.
Another defected BRS MLA back to BRS❓
Bhadrachalam BRS MLA who joined Congress month ago seen in BRS Chamber with BRS MLAs today in Assembly… pic.twitter.com/L3YGdPWy3D
— Krishank (@Krishank_BRS) July 30, 2024
ఇది కూడా చదవండి:BIG BREAKING: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే