TS politics: అప్పటివరకు వెయిట్‌ చేయండి.. ఇక ప్రతిపక్షాల మైండ్‌ బ్లాకే.. టికెట్ల కోసం కుస్తీలా?

కాంగ్రెస్‌, బీజేపీపై మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఈ నెల 15 కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బహిరంగ సభ తర్వాత ప్రతిపక్షాల మైండ్‌ బ్లాకేనన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ఈసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు హరీశ్‌రావు. కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనియ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు.

TS politics: అప్పటివరకు వెయిట్‌ చేయండి.. ఇక ప్రతిపక్షాల మైండ్‌ బ్లాకే.. టికెట్ల కోసం కుస్తీలా?
New Update

ఈ నెల 15న బీఆర్ఎస్(BRS) పార్టీ మేనిఫెస్టో(Manifesto) వచ్చిన తర్వాత ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుందని మంత్రి హరీశ్‌ రావు సెటైర్లు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్ స్టేషన్ పక్కన మైదానంలో ఈనెల 15న జరుగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ స్థలాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్‌తో కలిసి మంత్రి హరీశ్‌ రావు పరిశీలించారు. తర్వాత బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆసత్య సర్వేల పేరిట అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ గోబల్స్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనియ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు.

అక్కడ ఎక్కవ.. ఇక్కడ తక్కువ:
ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువ అనే విధంగా కాంగ్రెస్‌ ఉంటుందని విమర్శించారు హరీశ్‌రావు. మాటలు, మూటలు, ముఠాలు, మంటలు కాంగ్రెస్ పార్టీ తీరని వెటకారంగా మాట్లాడారు హరీశ్‌రావు. హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్, బీజేపీ వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కేసీఆర్ హుస్నాబాద్‌కు ఇచ్చిన గొప్ప వరమని పేర్కొన్నారు. 2009 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదన్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని తమతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తర్వాత తెలంగాణ ఇవ్వకుండా మా పార్టీని మింగేయాలని చూసిందన్నారు. మూడు గంటలు, మీటర్లు పెడతామంటున్న కాంగ్రెస్, బిజెపి వాళ్ళు మంచివాళ్లో, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ మంచోడా రైతులు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతని, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని విమర్శించారు.

మా పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నారు:
తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారన్నారు. ఒకప్పుడు తిండి లేని తెలంగాణ ఈ రోజు దక్షిణ భారత దేశ ధాన్య అడ్డాగా మారిందన్నారు. వరి ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ అయిందన్నారు. కైలాసంలో పెద్ద పాము మింగినట్టు తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే తెలంగాణ అభివృద్ధిలో కిందకి పడిపోతుందన్నారు. హైదరాబాద్‌కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ కలిసి వచ్చిన నియోజకవర్గమన్నారు. కేసీఆర్ హుస్నాబాద్‌లో మొదటి ఎన్నికల సభ పెడుతున్నారన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ఈసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.

ALSO READ: గ్యాస్ ధర తగ్గింపు, పెన్షన్ల పెంపు.. బీఆర్ఎస్ సంచలన హామీలివే?

#telangana-election-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe