సుఖేష్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన మంత్రి కేటీఆర్

సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబ్ పేల్చాడు. మనీ లాండరింగ్ కేసులో ఊచలు లెక్కిస్తున్న సుఖేష్ మరో సంచలన లేఖ రాశారు. ఈసారి ఏకంగా తెలంగాణ ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్‌లను టార్గెట్ చేస్తూ సంచలన లేఖ విడుదల చేశాడు. గతంలో తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌లు వెనక్కి తీసుకోవాలంటూ కవిత, కేటీఆర్‌ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించాడు. దీంతో రాజకీయంగా పెను సంచలనంగా మారింది.

సుఖేష్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన మంత్రి కేటీఆర్
New Update

తనకు సాక్ష్యాలు ఇవ్వాలని కేటీఆర్, కవిత తనపై ఒత్తిడి చేస్తున్నారంటూ సుఖేష్ చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన చాట్‌ హిస్టరీ కూడా ఉందంటూ చెప్తున్నాడు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర 100 కోట్ల భూమితో పాటు ఎన్నికల్లో సీటు ఇస్తామంటున్నారని లేఖలో రాసుకొచ్చాడు. లిక్కర్ స్కామ్‌తో పాటు పలు అంశాలపై పదేపదే లేఖలు విడుదల చేస్తున్న సుఖేష్‌ ఈసారి కేటీఆర్ తనపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

సుఖేష్ చంద్రశేఖర్‌ మంత్రి కేటీఆర్‌పై పలు ఆరోపణలు

రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌ తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. అయితే.. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. మోసగాడు, నేరస్థుడు సుఖేష్ నాపై కొన్ని హాస్యాస్పదమైన ఆరోపణలు చేశాడని మీడియా ద్వారా తెలుసుకున్నాను. నేను ఈ పోకిరీ గురించి ఎన్నడూ వినలేదు. అతని అర్ధం లేని మాటలపై చట్టపరమైన చర్య తీసుకోవాలనుకుంటున్నాను. ఇటువంటి కామెంట్స్ విషయంలో మీడియా జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థన అని ఆయన ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. అయితే మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌కు లేఖ రాశారు.

సుఖేష్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన మంత్రి కేటీఆర్

కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉంది. ఈ ఆధారాలని ఇప్పటికే ఈడీకి 65 -బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేశా. కవిత నుంచి రూ.15 కోట్ల నగదు తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ తరపు వారికి అందజేశా. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నా అంటూ గవర్నర్‌ తమిళసైకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. అయితే.. ఈ సుఖేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ మంత్రి కేటీఆర్ పై విధంగా స్పందించారు. అయితే, సుఖేష్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. సుఖేష్ చేసిన ఆరోపణలు తన దృష్టికి వచ్చాయన్నారు. అసలా వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదన్నారు. సుఖేష్‌ వ్యాఖ్యలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గతంలో కవితపైన, ఇప్పుడు కేటీఆర్ పైన ఆరోపణలతో సుఖేష్‌ ఇలా వ్యవహరించడంపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కూడా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe