Amith Shah: అమిత్ షాపై కేసు ఉపసంహరణ.. తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం!

ఎన్నికల సమయంలో చార్మినార్ పీఎస్ పరిధిలో అమిత్ షాపై నమోదైన కేసును తెలంగాణ పోలీసులు ఉపసంహరించుకున్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘించలేదన్న కారణంతో కేసు ఉపసంహరించుకున్నారు.

New Update
Amith Shah: అమిత్ షాపై కేసు ఉపసంహరణ.. తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం!

ఎన్నికల ప్రచారం సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. కోడ్ ఉల్లంఘించారన్న అభియోగంతో ఆయనపై కేసు నమోదైంది. అమిత్ షా తో పాటు కిషన్ రెడ్డిపై సైతం కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. తాజాగా ఆ కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు. వారు ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘించలేదన్న కారణంతో కేసు ఉపసంహరించుకున్నారు.

చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును వెనక్కి తీసుకున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజులకే తెలంగాణ పోలీసులు ఆయనపై కేసు ఉపసంహరించుకోడం చర్చనీయాంశమైంది.
publive-image

Advertisment
తాజా కథనాలు