Telangana: రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ భద్రత పెంపు.. విజయానికి సంకేతమా?! తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ భద్రతను భారీగా పెంచారు. సీనియర్ పోలీసు అధికారులు దగ్గరుండి మరీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఈ భద్రతను చూస్తుంటే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అనే సంకేతాలు అందుతున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. By Shiva.K 01 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రతను భారీగా పెంచారు పోలీసులు. సీనియర్ పోలీసులు అధికారులు దగ్గరుండి మరీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. పోలింగ్ అనంతరం వెలువడిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని తేల్చాయి. అధికారానికి కావాల్సిన మార్జిన్ సీట్ల కంటే ఎక్కువే వస్తాయని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందన్న సంకేతాలు వస్తుండటంతో.. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాయి. అంతేకాదు.. నిఘా వర్గాల నుంచి కూడా కాంగ్రెస్‌దే అధికారం అని సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఆయన ఇంటికి వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. భద్రతా పరంగా కీలక చర్యలు చేపడుతున్నారు. Also Read: చాలారోజుల తర్వాత హాయిగా పడుకున్న.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు! 40% ఓట్లు వచ్చిన వారికి పవర్.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది? #revanth-reddy #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి