TS News: బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అరెస్ట్.. ఆ కేసులోనేనా?

బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ను హైదరాబాద్-విజయవాడ హైవేపై ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూ హాస్టల్స్ మూసివేతపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారన్న విషయంపై ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

New Update
TS News: బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అరెస్ట్.. ఆ కేసులోనేనా?

బీఆర్ఎస్‌ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ క్రిషాంక్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌ వస్తుండగా పంతంగి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారంటూ క్రిషాంక్ ట్వీట్ చేశారు. తన కారు ముందుసీటులో సీఐ కూర్చున్న ఫోటో ను క్రిషాంక్ షేర్ చేశారు. పోలీసులు తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియడం లేదని క్రిషాంక్‌ పేర్కొన్నారు.

నిన్న క్రిషాంక్‌పై హైదరాబాద్‌లో పోలీసు కేసు నమోదు చేశారు. ఓయూలో కరెంట్, వాటర్ సమస్య వల్లే హాస్టల్స్‌ క్లోజ్‌ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేశాడంటూ క్రిషాంక్‌పై కేసు నమోదైంది. ఇంకా ఫేక్ ప్రకటనలు పోస్ట్ చేశారని కూడా ఆయనపై పోలీసులు అభియోగాలు మోపినట్లు సమాచారం. ఓయూ చీఫ్‌ వార్డెన్ ఫిర్యాదుతో క్రిషాంక్‌పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలోనే క్రిషాంక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు