వరుసగా విద్యార్థినిల సూసైడ్స్, ఆందోళనలో పేరెంట్స్!

రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా.. డిగ్రీ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఆత్మహత్యలకు గల కారణాలేంటనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

New Update
వరుసగా విద్యార్థినిల సూసైడ్స్, ఆందోళనలో పేరెంట్స్!

telangana/nizamabad/degree-student-commits-suicide-in-nizamabad-telangana-suchi

ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనను కలిగిస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్య ఘటన మరువక ముందే తాజాగా... నిజామాబాద్‌లో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆర్మూర్‌లోని ఎస్సీ బాలికల హాస్టల్లో రక్షిత అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆర్మూర్‌లోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో రక్షిత మూడవ సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం.

హాస్టల్‌లో ఉండే తోటి విద్యార్థినిల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్ధానిక ఆస్పత్రికి తరలించారు. రక్షిత ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విద్యార్థిని స్వస్థలం మెండోరా మండలకేంద్రం. రక్షిత అకాల మృతి వార్త తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా.. గతవారం బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఒకరు బాత్రూమ్‌లో ఉరివేసుకోగా.. మరొకరు హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అయితే చదువుకునేందుకు వెళ్లిన తమ బిడ్డలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రుల దు:ఖానికి అంతే లేకుండా పోతోంది. అంతేకాదు. వరుస ఘటనల పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyd Crime: రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి.. పిల్లల ముందే ప్రాణాలు కోల్పోయిన తల్లి!

హైదరాబాద్‌ సమీపంలోని ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. పిల్లలను బోగీలోకి ఎక్కించాక తాను ఎక్కే ప్రయత్నంలో శ్వేత అనే మహిళ కాలుజారి బోగీ, ప్లాట్‌ఫామ్‌ మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడే తీవ్రంగా గాయపడి మృతి చెందింది.

New Update
railway-station

railway station

Hyd Crime: ఓ తల్లి కన్నపిల్లల కళ్ల ముందే రైలు ప్రమాదంలో మృతి చెందింది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ సమీపంలోని ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆనందంగా స్వగ్రామానికి వెళ్లే ప్రయాణం ఒక్కసారిగా విషాదంగా మారింది. అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్‌,శ్వేత (33) దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్న వెంకటేశ్‌ వేసవి సెలవుల సందర్భంగా తన భార్య శ్వేత, ఇద్దరు పిల్లలను స్వగ్రామానికి పంపించాలనుకున్నారు. ఇందుకోసం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు కోసం ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేశారు. లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చి భార్యా పిల్లలను డీ3 బోగీలో కూర్చొబెట్టారు.

ప్రాణం తీసిన బోగీ నెంబర్:

అయితే రైలు బయలుదేరిన కొద్ది సేపటికే శ్వేత సీటుపై ఇతర ప్రయాణికులు వచ్చి ఇది తమదని చెప్పారు. వెంటనే టికెట్‌ను మరోసారి పరిశీలించగా తన బోగీ నంబరు డీ8గా ఉందని తెలుసుకుంది. రైలు రద్దీగా ఉండటంతో బోగీల మధ్య ప్రయాణించడం సాధ్యపడలేదు. దీంతో రైలు ఆగే తదుపరి స్టేషన్‌ అయిన చర్లపల్లిలో బోగీ దిగింది. పిల్లలు, లగేజీతో కలిసి డీ8 బోగీ వరకు చేరుకోగా అప్పటికే రైలు కదలడం ప్రారంభమైంది. పిల్లలను బోగీలోకి ఎక్కించాక తాను ఎక్కే ప్రయత్నంలో రైలు వేగం పెరిగింది. 

ఇది కూడా చదవండి: ఏసీ గది నుంచి నేరుగా ఎండలోకి వెళ్తున్నరా..? అయితే మీ ఆరోగ్యానికి..!!

ఈ తతంగంలో శ్వేత కాలుజారి బోగీ, ప్లాట్‌ఫామ్‌ మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడే తీవ్రంగా గాయపడి ట్రాక్‌ పక్కన పడిపోయింది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న భర్త వెంకటేశ్‌ ఘటనా స్థలానికి చేరుకొని భార్య మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యాడు. టికెట్‌లో బోగీ నంబరు స్పష్టంగా కనిపించకపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని విలపించాడు. శ్వేత మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం కోసం తరలించారు. ఒక్క చిన్న లోపం, ఒక టికెట్‌ తప్పిదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

(ts-crime | ts-crime-news | crime | latest-news | telugu-news)

ఇది కూడా చదవండి: బరువు తగ్గడానికి 8 రహస్యాలు..ఆశ్చర్య పరిచే అలవాట్లు

Advertisment
Advertisment
Advertisment