తల్లి లేదు, తండ్రి రాడు.. అయినా షాపులో పనిచేస్తూ విజేతగా..

New Update

చాలామంది తమ కలలను నిజం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు. మరికొంతమంది ఫైనాన్సియల్‌గా బాగున్నా సరే.. వాటిని సాకారం చేసుకునే క్రమంలో చాలామంది ఏదో ఒక సాకు చెప్తూ తప్పించుకుంటారు. కానీ, అలేఖ్య మాత్రం అలా కాదు...తన జీవితంలో ఎంతో విషాదం చవిచూసినా వాటన్నింటిని ఎదిరించి నిలబడింది. తాను అనుకున్న లక్ష్యాన్ని మొత్తానికి సాధించి తన సత్తా ఏంటో చూపించి అందరికి ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఈ అమ్మాయి ఏం చేసిందో తెలియాలంటే మాత్రం పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే...

nidamanuru-model-school-student-alekhya-success-story

జీవితంలో అనుకున్నది సాధించాలన్నా.. లక్ష్యాలను చేరలన్నా ఎంతో కష్టపడాలి. అందుకోసం అలుపెరగని యుద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మందికి కోరుకున్నది సాధించడానికి పెద్ద ఇబ్బందులు ఉండవు. కానీ, వారు విజయాన్ని వాయిదా వేసేందుకు ఎక్కడలేని కారణాలను చెబుతూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, పట్టుదల ఉన్నవాళ్లు మాత్రం సాకులు వెతకరు.. కన్నీళ్లను కూడా దిగమింగి అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఇంధనంగా వాడుకుంటారు. అలాంటి కోవకు చెందిందే అలేఖ్య అనే అమ్మాయి. ఆమె జీవితంలో కావాల్సినన్ని కష్టాలు ఉన్నాయి. కానీ, అన్నింటినీ అధిగమించి విజేతగా నిలిచి అందరికి స్పూర్తిగా నిలిచింది.

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొత్తలాపురానికి చెందిన కట్టెబోయిన వెంకటయ్య, లక్ష్మమ్మ దంపతుల కుమార్తే అలేఖ్య. తల్లికి అనారోగ్యం అని తెలియగానే కన్నతండ్రి వీరిని వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అలేఖ్యను తీసుకుని లక్ష్మమ్మ పుట్టింటికి వచ్చేసింది. తల్లికి భారం కాకుండా అలేఖ్య ఆరో తరగతి నుంచే నిడమానూరు వసతి గృహంలో ఉంటూ.. ఆదర్శ పాఠశాలలో చదువుకుంటోంది. ఆమె పదో తరగతికి వచ్చేసరికి తల్లి ఆరోగ్యం క్షీణించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే మానసికంగా కృంగిపోతారు. తమ కష్టం వినేవాళ్లే లేరా.. తనను ఆదుకునేది ఎవరూ అంటూ పెద్దవాళ్లు సైతం కంగారు పడతారు.

కానీ, అలేఖ్య మాత్రం కొండంత బాధను గుండెల్లోనే దాచుకుంది. ఎంతో కష్టపడి ఏప్రిల్ నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు రాసింది. ఏదో మొక్కుబడిగా రాసి వచ్చేయడం కాదు.. 9.7 జీపీఏతో పరీక్షల్లో తన సత్తాను చాటింది. అలేఖ్య పరిస్థితి తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు కొంత ఆర్థికంగా సహాయం చేశారు. భవిష్యత్ లో అలేఖ్య చదువుకు సంబంధించి కూడా తమవంతు సాయం చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం అలేఖ్య హైదరాబాద్ లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. అలేఖ్య కుటుంబ నేపథ్యం, ఆమెకు ఎదురైన సమస్యలు, ఆమె సాధించిన విజయం తెలుసుకుని అంతా శభాష్ అంటూ తారీఫ్ చేస్తున్నారు.

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: జూన్ 10న భారత్ బంద్..!...

🔴Live News Updates: జూన్ 10న భారత్ బంద్..!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

MI VS GT:  క్వాలిఫయర్స్ 2 కు ముంబయ్..గుజరాత్ ఇంటికి..

ముంబై ఇచ్చిన భారీ లక్ష్యానికి గుజరాత్ కుదేలయిపోయింది. సాయి సుదర్శన్ 49 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌ లతో 80 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 పరుగులు చేసి కష్టపడినప్పటికీ ఫలితం దక్కలేదు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబయ్ ఇచ్చిన 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. కమిందు మెండిస్ (20), రూథర్‌ఫోర్డ్ (24), షారుక్ ఖాన్ (13) పరుగులు చేశారు.

చివర్లో ముంబయి బౌలర్లు పుంజుకొని పరుగులు కట్టడి చేయడంతో స్కోరు వేగం తగ్గి గుజరాత్ ఓటమి చవిచూసింది. ఎమ్ఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, బుమ్రా, గ్లిసన్, శాంటర్న్ , అశ్వనీ కుమార్ లు చెరో ఒక వికెట్ తీసుకున్నారు. దీంతో క్వాలిఫయర్ 2 కు వెళ్ళిన ముంబయ్ ఇండయన్స్ ఆదివారం పంజాబ్ తో తలపడుతుంది. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు ఇప్పటికే ఫైనల్ కు వెళ్ళిన పోయిన ఆర్సీబీతో మ్యాచ్ ఆడతారు. 

Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!

రెచ్చిపోయిన రోహిత్ శర్మ..

ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్‌ స్టో (47), సూర్య (33), తిలక్ వర్మ (25), హార్దిక్ పాండ్యా 22 పరుగులతో రాణించారు. ఇక గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ధ్, సాయి కిశోర్ చెరో 2 వికెట్లు తీశారు. సిరాజ్‌ ఒక వికెట్ పడగొట్టాడు.

మరోవైపు రోహిత్‌ శర్మ ఈ సీజన్‌లో రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. ఐపీఎల్‌లో మొత్తం 7 వేల పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్‌లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు సాధించాడు. 

Also Read: cinema: కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను మనోజ్ ఇంట్లో పని వాళ్ళే దొంగిలించారు..విష్ణు

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

  • May 31, 2025 19:26 IST

    యుద్ధ విమానం కూలిపోయింది.. ఆపరేషన్ సిందూర్‌పై ఉత్తమ్‌ సంచలన వ్యాఖ్యలు

    పాక్‌తో జరిగిన యుద్ధంలో రాఫెల్ యుద్ధ విమానాలు కూలాయా అనే ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానం కూలినట్లు సీడీఎస్‌ అనిల్ చౌహన్‌ చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్రం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

    Uttam Kumar Reddy
    Uttam Kumar Reddy

     



  • May 31, 2025 19:26 IST

    పార్టీతో సంబంధాలు తెంపుకుంటూ.. కవిత నేడు ప్రకటించిన రూట్‌మ్యాప్ ఇదే..!

    జూబ్లీహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్‌ను కవిత నేడు ప్రారంభించారు. BRS, జాగృతి KCRకు 2 కళ్లని అన్నారు. పార్టీతో సంబంధం లేకుండా ప్రజల కోసం పోరాడేందుకు ఆమె రూట్‌మ్యాప్ తయారు చేసుకున్నారు. BCల కోసం రైల్‌రోకో, KCRకు నోటీసులపై ధర్నాకు సిద్ధమైయ్యారామె.

    KAVITHA ROUTE MAP



  • May 31, 2025 18:18 IST

    జూన్ 10న భారత్ బంద్..!

    కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ని నిరసిస్తూ జూన్ 10 (మంగళవారం) దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది ఆ పార్టీ. మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించనుంది.

    bharath band



  • May 31, 2025 18:03 IST

    జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే

    జూన్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు వచ్చాయి. దాదాపు 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. జూన్ 1, 6, 7, 8, 11, 14, 15, 22, 27, 28, 29, 30 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రాల బట్టి ఇవి మారే అవకాశం ఉంది.

    June Holidays 2025



  • May 31, 2025 18:02 IST

    పాక్‌ను తిడుతూ యువతి పోస్టు.. అరెస్టు చేసిన పోలీసులు

    ఆపరేషన్ సింధూర్‌పై స్పందిస్తూ పూణెకు చెందిన షర్మిస్తా పనోలి అనే లా స్టూడెంట్‌ ఎక్స్‌లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఒక మతాన్ని టార్గెట్‌ చేసాలా కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పోలీసు కేసు నమోదు కాగా ఆమెను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.

    Pune law student arrested in Gurugram for offensive Operation Sindoor-linked remarks
    Pune law student arrested in Gurugram for offensive Operation Sindoor-linked remarks

     



  • May 31, 2025 17:52 IST

    KCRకు BRS, జాగృతి రెండు కళ్లు.. త్వరలో రైల్ రోకో

    BRS ఎమ్మెల్సీ కవిత శనివారం జూబ్లీహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌కు BRS, జాగృతి రెండు కళ్ల లాంటివని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 18ఏళ్లగా ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేసిందన్నారు.

     MLC Kavitha
    MLC Kavitha

     



  • May 31, 2025 16:26 IST

    మాట్లాడుకోడాల్ లేవు.. పాకిస్తాన్‌కు తుపాకులతోనే సమాధానం చెప్తాం

    పాకిస్తాన్‌ ఇకపై భారత్‌పై దాడులకు ప్రయత్నిస్తే తుపాకులతోనే సమాధానం చెబుతామని ప్రధాని మోదీ హెచ్చరించాడు. శనివారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‎లో ప్రధాని మోడీ పర్యటించారు. సంఘ సంస్కర్త దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

    modi 123

     



  • May 31, 2025 16:16 IST

    షర్మిల, విజయ శాంతి, లక్ష్మీ పార్వతీతోపాటు రాజకీయ పార్టీలు నడిపిన నాయకురాళ్లు వీరే..!

    తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మహిళలు యాక్టీవ్‌గానే ఉన్నారు. లక్ష్మీ పార్వతీ ఎన్టీఆర్ తెలుగు దేశం, విజయ శాంతి తెలంగాణ ఇంటి పార్టీ, షర్మిలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు పెట్టారు. కవిత కూడా ప్రస్తుతం కొత్త రాజకీయ పార్టీ పెడుతుందని వార్తలు వస్తున్నాయి.

    women in political parties



  • May 31, 2025 16:13 IST

    ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన ఆర్మీ

    ఆపరేషన్ సిందూర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఉద్రిక్త పరిస్థితులు అణుయుద్ధం స్థాయికి చేరుకోలేదని చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS) అనిల్ చౌహన్‌ అన్నారు. పాక్ ఆరు భారత యుద్ధ విమానాలు కూల్చేసిందని చేసిన వాదనలు అవాస్తవం అని తెలిపారు.

    Cds Anil Chauhan Responds For The First Time On Operation Sindoor Losses
    Cds Anil Chauhan Responds For The First Time On Operation Sindoor Losses

     



  • May 31, 2025 13:51 IST

    BRS MLC Kavitha: కవిత దూకుడు.. కొత్త ఆఫీస్ ప్రారంభం.. 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నా!

    బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఈరోజు ఆమె తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్‌ను ప్రారంభించనున్నారు. కేసీఆర్‌పై కాళేశ్వరం విచారణకు వ్యతిరేకంగా జూన్‌ 4న ధర్నా చేయనున్నారు. 

    BRS MLC Kavita
    BRS MLC Kavita

     



  • May 31, 2025 11:54 IST

    Rashid Khan: రషీద్ భయ్యా ఇలా చేశాడేంటి?.. IPL చరిత్రలో రూ. 18 కోట్ల స్టార్ ఆల్ రౌండర్ చెత్త రికార్డు..

    IPL చరిత్రలో రషీద్ ఖాన్ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. MIతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మరో రెండు సిక్సర్లు ఇవ్వడంతో ఈ సీజన్‌లో మొత్తం సిక్సర్ల సంఖ్య 33కు చేరింది.

    Rashid Khan Registers Unwanted Record in IPL 2025 season
    Rashid Khan Registers Unwanted Record in IPL 2025 season Photograph: (Rashid Khan Registers Unwanted Record in IPL 2025 season)

     



  • May 31, 2025 11:48 IST

    DOGE: ఎలాన్ మస్క్ తర్వాత డోజ్ పరిస్థితి ఏంటి? మూతబడుతుందా?

    అమెరికా ప్రభుత్వ బాధ్యతలకు ఎలాన్ మస్క్ టాటా బైబై చెప్పేశారు.  డోజ్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు డోజ్ పరిస్థితి ఏంటి? ట్రంప్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుని..సమూల మార్పులు చేపట్టిన డోజ్ ను ఏం చేయనున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

     Elon Musk and Trump
    Elon Musk and Trump

     



  • May 31, 2025 11:47 IST

    Moscow: పాకిస్తాన్ తో రష్యా డీల్స్.. భారత్ తో సంబంధాలు చెడగొట్టేందుకేనా?

    పాకిస్తాన్ కు రష్యా ఆయుధాలను సప్లై చేస్తోంది ..దీని కోసం బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది...ఈ వార్తలకు చెక్ పెట్టింది మాస్కో. పాక్ తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని...భారత్ తో తమ సంబంధాలు చెడగొట్టేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేసింది. 

    russia
    Putin, Shehabaz Sharif

     



  • May 31, 2025 10:45 IST

    Ap Crime News: ‘నిన్ను ప్రేమిస్తున్నా’.. మాయమాటలతో బాలిక న్యూడ్ వీడియోలు సేకరించి - ఛీ ఛీ

    బాలిక న్యూడ్ వీడియోలు సేకరించి డబ్బులు గుంజేసిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఓ బాలికను ప్రేమిస్తున్నట్లు నమ్మించి కారు డ్రైవర్ రాజు న్యూడ్‌వీడియోలు సేకరించాడు. వాటితో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాడు. పోలీసులు అతడిపై కేసు నమోదుచేశారు.

    Car driver blackmailed girl for money with nude videos in Vijayawada



  • May 31, 2025 10:27 IST

    TG Crime : పుట్టినరోజునే యువకుడి హత్య

    పుట్టినరోజే ఆ యువకుడికి చివరిరోజు అయ్యింది. బర్త్‌ డే అని స్నేహితులతో సంతోషంగా గడుపాదామని వెళ్లిన యువకున్ని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. యువకుడి వద్ద ఉన్న బంగారం, డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో నిరాకరించడమే ఆ యువకుడికి శాపమైంది. 

    Young man murdered



  • May 31, 2025 10:26 IST

    Naa Anveshana: మనదేశం ఏమైనా పర్వాలేదా? సన్నియాదవ్‌ పై ప్రపంచ యాత్రికుడు ఫైర్‌

    బైక్ రైడ‌ర్, యూట్యూబ‌ర్ భ‌య్యా స‌న్నీయాద‌వ్‌కు మనదేశం ఏమైపోయినా పర్వాలేదని డబ్బులు వస్తే చాలనుకుంటున్నాడని యూట్యూబ‌ర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మండిపడ్డారు. కాగా సన్నీ యాదవ్‌ను ఇటీవల చైన్నై ఎయిర్‌పోర్టులో ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.  

    Naa Anveshana



  • May 31, 2025 10:26 IST

    USA: ఎలాన్ మస్క్ కు ట్రంప్ వీడ్కోలు..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అధ్యక్షుడు

    అమెరికా ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్న ఎలాన్ మస్క్ కు అధ్యక్షుడు ట్రంప్ ఘనంగా వీడ్కోలు పలికారు. దాంతో పాటూ మస్క్ కు బంగారు రంగుతో కూడిన తాళం చెవిని బహుమతిగా ఇచ్చారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతి అందిస్తానని ట్రంప్‌ తెలిపారు.

    usa
    Trump Special gift to Musk

     



  • May 31, 2025 10:25 IST

    India-Turkey: టర్కీతో మరో తెగతెంపులు..టర్కిష్ ఎయిర్ లైన్స్ తో భాగస్వామ్యం రద్దు

    పాకిస్తాన్ కు టర్కీ మద్దతిస్తున్న విషయం తెలిసిందే. దీంతో టర్కీతో భారత ప్రభుత్వం తెగతెంపులు చేసుకుంటోంది. తాజాగా కేంద్రం ఇండిగోను టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో తన విమానాల లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా ముగించాలని ఆదేశించింది.

    india
    Stop leasing-turkish-aircraft

     



  • May 31, 2025 10:24 IST

    Big Diplomatic Win: భారత్ దౌత్యం ఫలించింది..పాక్ గురించి తెలుసుకున్నామన్న కొలంబియా

    భారత్ దాడుల్లో చనిపోయిన పాకిస్తానీయులకు సంతాపం తెలియజేస్తూ ప్కటన చేసిన కొలంబియా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన దౌత్య ఫలితమే ఇదంతా అని తెలుస్తోంది. 

    india
    Big Diplomatic Win, Colombia Withdraws Statement

     



  • May 31, 2025 08:56 IST

    AP: తప్పుల తడకగా పదవ తరగతి ఫలితాలు..ఐదుగురు వాల్యూయేటర్లు సస్పెండ్

    ఏపీలో పదవ తరగతి ఫలితాలు సంచలనం రేపుతున్నాయి. పాసయి, మంచి మార్కులు వచ్చే విద్యార్థులను ఫెయిల్ చేశారు. ఇప్పుడు రీ వాల్యూయేషన్ లో లోపాలు అన్నీ బయటపడుతున్నాయి. దీంతో 5 మంది వాల్యూయేటర్లను విద్యాశాఖ సస్పెండ్ చేసింది.

    ap 10th class public exam time table 2025
    ap 10th class public exam time table 2025 Photograph: (ap 10th class public exam time table 2025)

     



  • May 31, 2025 08:06 IST

    BIG BREAKING: నైజీరియాలో భారీ వర్షాలు.. 115 మంది మృతి

    నైజీరియాలో భారీ వర్షాలకు 115 మంది మృతి చెందారు. నిగర్ నది ఉప్పొంగడంతో మూడు వేలకు పైగా ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వేలాది మంది ఆ వరదల్లో కొట్టుకుని పోయారు. ఇప్పటికే 115 మంది మృతి చెందగా.. వీరి సంఖ్య ఇంకా పెరగనుందని అధికారులు చెబుతున్నారు.

    Heavy Rains
    Heavy Rains

     



  • May 31, 2025 07:43 IST

    IND-PAK వార్ నేనే ఆపాను.. మరోసారి ట్రంప్ గొప్పలు

    భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. దాడులు చేసుకుంటూ, అణ్వాయుధాలను ఉపయోగించే దేశాలతో వ్యాపారాలు చేయనన్నారు. ఇరు దేశాల గ్రేట్ లీడర్స్ తన మాట విని యుద్ధాన్ని ఆపేశారని ధన్యవాదాలు తెలిపారు. 

    Donald Trump
    Donald Trump

     



  • May 31, 2025 07:16 IST

    Manchu Brothers: అంతా మనోజే చేయించాడు..కన్నప్ప హార్డ్ డ్రైవ్ విషయంలో విష్ణు సంచలన కామెంట్స్

    టాలీవుడ్ లో ప్రస్తుతం కన్నప్ప హార్డ్ డ్రైవ్ దొంగతనం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో మళ్ళీ అన్నదమ్ములు ఇద్దరూ కొట్టుకుంటున్నారు. ఆ హార్డ్ డ్రైవ్ మనోజ్ ఇంట్లో పని చేసే రఘు, చరిత అనే వాళ్ళే కొట్టేశారని మంచు విష్ణు ఆరోపిస్తున్నారు. 

    manchu vishnu about Prabhas
    manchu vishnu 

     



Advertisment
Advertisment