Telangana Congress : టీ కాంగ్రెస్‌లో కొత్త జోష్‌.. ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకపై మరోలెక్క..!

తెలంగాణ కాంగ్రెస్‌లో నూతనుత్తేజం రాబోతుందా..? చేరికలతో కాంగ్రెస్‌లో ఫుల్‌ జోష్‌లో కన్పిస్తుందా..? కాంగ్రెస్‌ పార్టీలో చేరబోయే నాయకులు ఎవరు..? వారి చేరికతో బీఆర్‌ఎస్‌కు ఎంత నష్టం కల్గనుంది. ఇటీవల పార్టీని వీడినవారు.. పార్టీ నేతలతో టచ్‌లో లేని వారు హస్తం తీర్థం పుచ్చుకోబోతున్నారా..? వారెవరు..? వారికి ఎలాంటి పదవులు ఇస్తామని కాంగ్రెస్ వలలో వేసుకుంటుంది. హస్తం పార్టీలో కొత్త నేతలకు పదవులు ఉంటాయా ..? ఇన్నాళ్లు ఒక లెక్క ఇక మీదట మరో లేక్క అంటున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తన మాట మీద నిలబడుతారా అనేది చూడాలి.

New Update
Telangana Congress : టీ కాంగ్రెస్‌లో కొత్త జోష్‌.. ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకపై మరోలెక్క..!

తెలంగాణ కాంగ్రెస్ ఫుల్‌ జోష్‌లో కన్పిస్తుంది. హస్తం పార్టీకి గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతున్నారు. దీంతో హస్తం పార్టీ నేతలు ఇప్పటి నుంచే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిలో ఎవరుకి ఏ పదవి ఇవ్వాలి, ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలి, నియోజకవర్గల్లో ఏ నేతకు ప్రజల్లో నమ్మకముంది. నియోజకవర్గంపై పట్టున్న నేత ఎవరు..? అనే అంశాలపై చర్చలు జరుపుతుంది. దీనికోసం కాసేపటి క్రితమే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌ మాణిక్‌ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ కీలక నేతలు పార్టీలో చేరబోయ్యే నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ త్వరలో బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోగా.. మాజీ మంత్రి జూపల్లి కష్ణారావు త్వరలో హస్తం గూటికి చేరుకోనున్నారు. వీరితో పాటు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనిత హస్తం పార్టీలో చేరబోతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం, ఏనుగు రవీందర్ సైతం ఈ లిస్ట్‌లో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలతో పాటు బిజినెస్ మ్యాన్ ఆరెంజ్ ట్రావెల్స్ యాజమాని సునీల్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయితో పాటు దిలీప్‌, మందుల శామేల్‌, కోదాడకు చెందిన నేత శశిధర్‌, జడ్పీ చైర్‌పర్సన్లు సునీతా మహేందర్ రెడ్డి, సరిత ఉన్నారు.

మరోవైపు ఎప్పుడు ఎలా స్పందిస్తాడో తెలియని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి నివాసంలో ఈ మీటింగ్ జరుగడం చర్చనీయంశంగా మారింది. కానీ ఇన్నాళ్లు ఓ లెక్క.. ఇకపై మరోలైక్క అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సినిమా డైలాగ్‌ పంచ్‌లు వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలం పెరుగుతుందని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్‌ను బంగళాఖాతంలో పడేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. మరోవైపు ఈ మీటింగ్‌కు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్‌లో మంటలు చల్లారలేదనే వాదన విపిస్తోంది. కాగా ఈ సమావేశానికి సంబంధించి జగ్గారెడ్డికి ఆహ్వానం అందిందా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు