ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ని వీడని ప్రమాదాలు, ఇది నాలుగోసారి తెలుసా..?

దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం ఒడిశా రాష్ట్రంలో జరిగింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే మరో సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. హౌరా - సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురై తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు.. ఏకంగా ఇది నాలుగుసార్లు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురవడంతో ప్రయాణికులు ఇందులో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. అయితే రైలు ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

New Update
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ని వీడని ప్రమాదాలు, ఇది నాలుగోసారి తెలుసా..?

భారత్‌లో వరుస రైలు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మొన్న ఒడిశా రైలు ప్రమాదంలో కొన్ని వందల మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తెలంగాణ రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మాయిపల్లి - పగిడిపల్లి మార్గంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ అగ్నికి ఆహుతి అయింది. ఈ ఘటన అందరిని ఆందోళన కలిగించింది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి బోగీలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ప్రయాణికులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం పగటిపూట జరగడంతో పెను ప్రమాదం తప్పింది.

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరగడం ఇది నాలుగోసారి. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ గత 29 సంవత్సరాలుగా ప్రయాణికులకు సేవలందిస్తోంది. మొదటిసారిగా 2013లో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద రైలు బోగీలకు, ఇంజిన్‌కు మధ్యనున్న లింక్ తెగిపోయింది. ఆ సమయంలో కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం 2015లో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. హౌరాలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు బాంబు పెట్టారు. రైలులో ఓ సిలిండర్ కనిపించింది. ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిలిండర్‌ను తనిఖీ చేశారు. తనిఖీలో అది బాంబని తేలింది. దీనిని బాంబు డిస్పోజల్ స్క్వాడ్ బాంబును నిర్వీర్యం చేశారు.

దాని తర్వాత 2022 మార్చి 26న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ట్రైన్ నడుస్తున్న సమయంలో రైలు నుంచి మూడు బోగీలు విడిపోయాయి. కిలోమీటర్ ముందుకు వెళ్లిన ఇంజిన్‌కు బోగీలను అమర్చారు. దాని తర్వాత 2023 జూన్ 7న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లాలో మరోసారి ప్రమాదానికి గురైంది. రన్నింగ్ ట్రైన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోగీలలో దట్టమైన పొగ అలుముకుంది. మంటలు చూసిన ప్రయాణికులు చైన్ లాగారు. రైలు ఆగిన వెంటనే అందరూ అప్రమత్తమై బోగీల నుండి బయటకు వచ్చి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు