Telangana New DGP: తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజీపీగా జితేందర్ ను నియమించింది. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది ప్రభుత్వం.

New Update
Telangana New DGP: తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్

తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ కౌంటింగ్ జరుగుతుండగానే అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయనపై వేటు వేసిన ఈసీ.. అనిల్ గుప్తాను కొత్త డీజీపీగా నియమించింది. అప్పటి నుంచి ఆయనే డీజీపీగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కమిషనర్లను, ఎస్పీలను మార్చిన రేవంత్ సర్కార్.. డీజీపీని మాత్రం మార్చలేదు. తాజాగా అనిల్ గుప్తా స్థానంలో డీజీపీగా జితేందర్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ నూతన డీజీపీ జితేందర్ కొద్ది సేపటి క్రితం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
publive-image

రైతు కుటుంబం నుంచి..
జితేందర్ విషయానికి వస్తే.. పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. ఈయన 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌ కు చెందిన అధికారి. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికయ్యారు. ఆయన తొలి పోస్టింగ్ లో నిర్మల్‌ ఏఎస్పీగా పని చేశారు. అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ తరువాత మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా కూడా పని చేశారు. 2004-06 వరకు ఢిల్లీ సీబీఐలో గ్రేహౌండ్స్‌లో బాధ్యతలు నిర్వర్తించారు.

అనంతరం విశాఖపట్నం రేంజ్‌లో డీఐజీగా పదోన్నతి పొంది బాధ్యతలు చేపట్టారు. వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా తెలంగాణ ఉద్యమం సమయంలో కొనసాగారు. ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తదితర కీలక బాధ్యతలను నిర్వర్తించారు. అనంతరం హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత జైళ్లశాఖ డీజీగా, తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా పనిచేశారు. ఆయన 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు