TS Municipalities: కాంగ్రెస్ ఖాతాలోకి మరో మున్సిపాలిటీ.. బీఆర్ఎస్ కు 21 మంది కౌన్సిలర్ల రాజీనామా!

తెలంగాణలో అధికారం మారడంతో వివిధ మున్సిపాలిటీల్లో అవిశ్వాస రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా బెల్లంపల్లిలో 21 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరుతామని వారు ప్రకటించారు. వీరు త్వరలోనే చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది.

TS Municipalities: కాంగ్రెస్ ఖాతాలోకి మరో మున్సిపాలిటీ.. బీఆర్ఎస్ కు 21 మంది కౌన్సిలర్ల రాజీనామా!
New Update

తెలంగాణలో బీఆర్ఎస్( brs) ప్రభుత్వం మారగానే రాష్ట్రంలో అవిశ్వాస రాజకీయాలు ఊపందుకున్నాయి. పలు జిల్లాల్లో అవిశ్వాస తీర్మానాలతో కాంగ్రెస్ పార్టీ పురపాలికలను తన సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే నల్లగొండ (nalgonda) జిల్లా మున్సిపాలిటి కాంగ్రెస్ వశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు, బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన 21 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవటం లేదని వారు ఆరోపిస్తున్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడానికి నిశ్చయించుకున్నారని తెలుస్తున్నది. వీరంతా క్యాంపులకు తరలివెళ్లినట్లు తెలుస్తుంది.

అన్ని దారులు కాంగ్రెస్ వైపే

కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ (congress party) పార్టీ అధికారంలోకి రావడంతోనే అవిశ్వాసలకు తెరతీసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాసం ప్రవేశపెట్టిన కౌన్సిలర్లు కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం ఇచ్చారు. అలాగే జనగామ మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు సైతం అవిశ్వాసం ప్రవేశపెట్టి హనుమకొండలోని హరిత హోటల్ కు చేరుకున్నారు. వీటితో పాటు వికారాబాద్ మున్సిపాలిటీలోనూ అసమ్మతి సెగలు రాజుకున్నాయి.

ఇవే కాక గజ్వేల్, ఎల్లారెడ్డి, వనపర్తి, ఆర్మూర్, నందికొండ, చండూరు, మేడ్చల్, చేర్యాల తదితర మున్సి పాలిటీల్లోనూ అవిశ్వాసానికే కౌన్సిలర్లు మొగ్గుచూపుతున్నారు. ఫిర్జాదీగూడ, జవహార్ నగర్ లోనూ అసంతృప్తులు అవిశ్వాసలవైపే మొగ్గు చూపుతున్నారు. రామగుండం కార్పొరేషన్ లోనూ అసమ్మతి చెలరేగినప్పటికీ వారు కేవలం చైర్మన్ మార్పును మాత్రమే కోరుకుంటున్నారని, తిరిగి బీఆర్ఎస్ కు చెందిన కార్పొరేటర్ నే చైర్మన్ గా ఎన్నుకోవడానికి సిద్ధపడుతున్నారనే ప్రచారం సాగుతుంది.

ఇది కూడా చదవండి: Telangana News: భలే ఐడియా బాసూ.. ఆర్టీసీ బస్సులో మర్చిపోయిన పందెం కోడిని ఏం చేస్తున్నారో తెలుసా?

తలనొప్పిగా మారిన అవిశ్వాసాలు

కాగా ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారిగా అధికార పీఠానికి దూరం కావడంతో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆయా మున్సిపాలిటీల్లో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగిన వారి ఒత్తిడి, రాజకీయ అవసరాల రీత్య ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ద్వితీయ శ్రేణీ నాయకులు ఇప్పుడిప్పుడే అసమ్మతి రాగాలు అందుకుంటున్నారు. ఈ వ్యవహారం మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. వారి మధ్య సయోధ్య కుదర్ఛడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.

మున్సిపల్ చట్టం ఏం చెబుతుంది

గతంలో తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న 1965 మున్సిపల్‌ చట్టం, 1994 మున్సిపల్‌ చట్టాల స్థానంలో 1919లో కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా చట్టాన్ని తీసుకువచ్చింది.దీనిప్రకారం మూడేళ్లకు అవిశ్వాసానికి ఆస్కారం ఉంది. అయితే అవిశ్వాసాన్ని గతేడాది నాలుగేళ్లకు పెంచుతూ   ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ గెజిట్ విడుదల కాలేదు. దీంతో గతంలో అమలు చేసిన చట్టం ప్రకారమే అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉండటంతో ఇదే అదనుగా తీర్మానాలు జోరందుకుంటున్నాయి.

#congress-party #telangana-municipalities #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe