Telangana MP Results: పార్టీ మారిన నేతలకు బిగ్ షాక్

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసిన నేతలకు ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీ మారిన 8 మంది నేతలను చిత్తుగా ఓడించారు. బిబి పాటిల్, రంజిత్ రెడ్డి, నాగేందర్, పట్నం సునీత, ఆరూరి రమేష్, భరత్, సైది రెడ్డి, సీతారాం నాయక్ ఎంపీ ఎన్నికల్లో ఓటమి చెందారు

New Update
Telangana MP Results: పార్టీ మారిన నేతలకు బిగ్ షాక్

Telangana MP Results: లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ ప్రజలు కీలక తీర్పు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేతలకు ఓటమి దెబ్బ చవి చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన నేతలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో చేరి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. కాగా అధికారం కోసం పార్టీలు మారిన నేతలను ప్రజలు ఎంపీ ఎన్నికల్లో తమ ఓటుతో తిరస్కరించారు. మరోవైపు 23 ఏళ్ల వయసు గల టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) పార్టీకి పార్లమెంట్ లో ఒక్క ఎంపీ కూడా లేకపోవడం ఇదే తొలిసారి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు బిగ్ షాక్ ఇచ్చాయనే చెప్పాలి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ స్థానంలో కూడా విజయం సాధించలేక పోయింది.

పార్టీ మారిన నేతలకు బిగ్ షాక్..

1. బిబి పాటిల్ - జహీరాబాద్
2. రంజిత్ రెడ్డి - చేవెళ్ల
3. దానం నాగేందర్ - సికింద్రాబాద్
4. పట్నం సునీతా మహేందర్ - మల్కాజిగిరి
5. ఆరూరి రమేష్ - వరంగల్
6. భరత్(రాములు) - నాగర్ కర్నూల్
7. సైది రెడ్డి - నల్గొండ
8. సీతారాం నాయక్ - మహబూబాబాద్

Advertisment
Advertisment
తాజా కథనాలు