Ponguleti Scam: ఫేక్ బ్యాంక్ గ్యారెంటీల స్కామ్‌పై స్పందించని పొంగులేటి.. కారణమేంటి? ఏపీలో దాదాపు రూ. 4500 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో తెలంగాణ మంత్రి పొంగులేటి కంపెనీ ఫేక్ గ్యారెంటీలను సమర్పించిన విషయం RTV బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీవీ ప్రతినిధి పొంగులేటిని వివరణ కోరగా స్పందించలేదు. తర్వాత మాట్లాడుతానంటూ సీరియస్ గా చూస్తూ వెళ్లిపోయారు. By Nikhil 26 Aug 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఏపీలో దాదాపు రూ. 4500 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో తెలంగాణ మంత్రి పొంగులేటి కంపెనీ ఫేక్ గ్యారెంటీలను సమర్పించిన విషయం RTV బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీవీ ప్రతినిధి పొంగులేటిని వివరణ కోరగా స్పందించలేదు. తర్వాత మాట్లాడుతానంటూ సీరియస్ గా చూస్తూ వెళ్లిపోయారు. ప్రస్తుతం తాను ప్రభుత్వ కార్యక్రమంలో ఉన్నానని.. ఫేక్ బ్యాంక్ గ్యారెంటీస్ అంశంపై తర్వాత బదులిస్తానని ఆర్టీవీతో మంత్రి చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫేక్ గ్యారెంటీల వ్యవహారాన్ని ఆర్టీవీ ఆధారాలతో సహా బయటపెట్టింది. APSPDCLతో పాటు APEPDCL నుంచి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్టులు పొందింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు APSPDCL నుంచి రూ.2,451 కోట్లు, అలాగే APEPDCL నుంచి రూ.2,043 కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కాయి. మొత్తంగా వీటి విలువ రూ.4,500 కోట్లు. ఇప్పటికే ఈ రెండు సంస్థల నుంచి పొంగులేటి సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ రూ.217 కోట్లు అడ్వాన్సు కూడా తీసుకుంది. APSPDCL నుంచి రూ.115 కోట్లు, అలాగే APEPDCL నుంచి రూ.102 కోట్లు వచ్చాయి. అయితే ఈ మొత్తం కాంట్రాక్టుకు పొంగులేటి ఫేక్ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారు. ఇప్పటికే ఇచ్చిన గ్యారెంటీ గడువు ముగిసిందని APSPDCL.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు లేఖ కూడా రాసింది. దేశంతో సంబంధం లేని బ్యాంకు ద్వారా గ్యారెంటీలు ఇవ్వడంపై పొంగులేటి సంస్థపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. కేవలం రూ.8 కోట్ల విలువైన యూరో ఎగ్జిమ్ బ్యాంకు.. రూ.వేల కోట్ల గ్యారెంటీలు ఇవ్వడం వందలు/వేల కోట్ల స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. మేఘా లాంటి బడా కాంట్రక్టు సైతం ఈ కుంభకోణంలో భాగమే. దొంగ బ్యాంకు గ్యారెంటీలతో వేల కోట్ల ప్రజాధనాన్ని కాంట్రాక్టు సంస్థలు నొక్కేస్తున్న వ్యవహారంపై గత కొన్ని రోజులు ఆర్టీవీ వరుస కథనాలను ప్రసారం చేస్తోంది. తద్వారా ఈ ఫేక్ గ్యారెంటీల బాగోతాన్ని.. దాని వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలను బయటపెడుతోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి