Hyderabad: ప్రసంగం మధ్యలో కేటీఆర్ ఫోన్ కు ఎమర్జెన్సీ అలర్ట్.. మంత్రి ఏం చేశారంటే?

ఇవాళ ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా ప్రజలందరి ఫోన్లకు అంతుచిక్కని మెసేజ్ అలర్ట్ వస్తోంది. నాన్‌ స్టాప్‌గా అలర్ట్ బజ్ మోగుతోంది. అలర్ట్ సింబల్‌తో ఉండటంతో.. అసలేం జరుగుతుందో అర్థం కాక.. జనాలు ఆగం ఆగం అవుతున్నారు. ఎమర్జెన్సీ అంటూ వస్తున్న ఆ సందేహం జనాల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. చాలా మంది ఎందుకు ఈ మేసేజ్ వస్తోందో తెలియక తికమక పడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు.

Hyderabad: ప్రసంగం మధ్యలో కేటీఆర్ ఫోన్ కు ఎమర్జెన్సీ అలర్ట్.. మంత్రి ఏం చేశారంటే?
New Update

Telangana Minister KTR: ఇవాళ ఉదయం నుంచి దేశ వ్యాప్తంగా ప్రజలందరి ఫోన్లకు అంతుచిక్కని మెసేజ్ అలర్ట్(Emergency Alert) వస్తోంది. నాన్‌ స్టాప్‌గా అలర్ట్ బజ్ మోగుంతోంది. అలర్ట్ సింబల్‌తో ఉండటంతో.. అసలేం జరుగుతుందో అర్థం కాక.. జనాలు ఆగం ఆగం అవుతున్నారు. ఎమర్జెన్సీ అంటూ వస్తున్న ఆ సందేహం జనాల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. చాలా మంది ఎందుకు ఈ మేసేజ్ వస్తోందో తెలియక తికమక పడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్(Minister KTR) కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. ఆయనో ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నారు. ఓ ఇన్వెస్టర్స్ మీటింగ్‌లో సీరియస్‌గా ప్రసంగిస్తున్నారు. పెట్టుబడులకు తెలంగాన స్వర్గధామం అంటూ ఇన్వెస్టర్లుకు వివరిస్తున్నారు. మీటింగ్‌ హాల్‌లోని ప్రముఖులు సైతం సైలెంట్‌గా ఆయన ప్రసంగాన్ని వింటున్నారు. ఇంతలో ఎమర్జెన్సీ అలర్ట్ మోగింది. నాన్ స్టాప్‌గా ఎమర్జెన్సీ అలర్ట్ మోగడంతో.. ఒక్కసారిగా షాక్ అయ్యారు మంత్రి కేటీఆర్. ఏం జరుగుతోంది? అంటూ సభికులను ప్రశ్నించారు. ఫైర్ అలారామా? మనందరం బయటకు వెళ్లాలా? అసలే మీటింగ్ హాల్ అంతా క్లోజ్ చేసి ఉంది? అంటూ స్వల్పంగా ఆయన కంగారు పడినట్లు కనిపించారు. అయితే, స్పీకర్ అలర్ట్ అని కొందరు చెప్పడంతో లైట్ తీసుకున్నారు మంత్రి కేటీఆర్. ఆ తరువాత తన ప్రసంగాన్ని తాను యధావిధిగా కొనసాగించారు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో ట్వి్‌ట్టర్‌లో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది.

ఇదిలాంటే.. ఈ అలర్ట్ మెసేజ్ దేశ వ్యాప్తంగా ప్రజలందరి మొబైల్స్‌కి వస్తోందట. దీనిని కేంద్ర టెలికాం డిపార్ట్‌మెంట్ పంపుతోందట. ఇందులో టెన్షన్ పడాల్సిన పనేం లేదని అంటోంది కేంద్ర ప్రభుత్వం. కొత్త ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ ను డెవలప్ చేస్తున్నారని, అందులో భాగంగానే టెస్టింగ్ మెసేజ్ లను పంపిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రకృతి విపత్తులు అంటే భూకంపాలు, సునామీలు, హఠాత్తుగా వచ్చే వరదలు, తుఫాన్లు లాంటి వాటి సమాచారాన్ని ప్రజలకు అందించి అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి కేంద్రం ఈ ఎమర్జెన్సీ అలెర్ట్ సిస్టమ్ ను రూపొందించింది. ఇది పని చేస్తోందో లేదో టెస్ట్ చేసేందుకే దేశ వ్యాప్తంగా ప్రజల ఫోన్లకు మెసేజ్ లను పంపిస్తోంది భారత ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్ విభాగం. పెద్ద సౌండ్ తర్వత వాయిస్ తో వచ్చే ఈ మెసేజ్ లు విపత్తులను ప్రజలకు తెలియజేస్తాయి. కేవలం చదువుకోవడమే కాకుండా చదివి వినిపిస్తాయి కూడా. ఇలాంటి సిస్టమ్ అమెరికా లాంటి దేశాలు ఎప్పటి నుంచో అమలు చేస్తున్నాయి. భారత్ కూడా ఇప్పుడు మొదలెట్టింది. దీనివల్ల జరిగే నష్టాన్ని చాలా వరకూ తగ్గించుకోవచ్చును. ప్రజలు అలెర్ట్ అవుతారు కాబట్టి వెంటనే చర్యలు తీసుకుంటారు. స్థానిక అధికారులు సైతం ముందస్తు చర్యలను ఏర్పాటు చేయడానికి వీలు అవుతుంది. అయితే ఇప్పటివరకూ భారత ప్రజలకు ఇది అలవాటు లేదు కాబట్టి ఒక్కసారి ఎమెర్జెన్సీ అలెర్ట్ మెసేజ్ రాగానే ఆందోళనకు గురయ్యారు.

Also Read:

Chandrababu Arrest: చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోంది.. నారా లోకేష్ సంచలన ఆరోపణలు..

canada issue:కెనడియన్లకు భారతీయ వీసాలు నిలిపివేత…

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe