Minister KTR: అమ్మానాన్న కోరిక అది.. నేను మాత్రం ఇలా అయ్యా.. మంత్రి కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

'అమ్మ ఏమో నన్ను డాక్టర్‌గా చూడాలనుకుంది. నాన్న ఏమో కలెక్టర్‌గా చూడాలనుకున్నారు.. నేనేమో రాజకీయ నాయకుడిని అయిపోయా.' అంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసి సభికుల్లో నవ్వులు పూయించారు మంత్రి కేటీఆర్.

New Update
Telangana: రూ.20 వేల కోట్లతో వరద సమస్యలు పరిష్కరిస్తాం.. మంత్రి కేటీఆర్ హామీ..

Telangana Minister KTR: తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ తరువాత అంతటి మాటల చాణక్యం మంత్రి కేటీఆర్(Minister KTR) సొంతం అని చెప్పొచ్చు. అటు మాస్ ప్రజలతో, ఇటు క్లాస్ పీపుల్స్‌తో ఇట్టే మింగిల్ అయిపోయే స్వభావం ఆయన సొంతం. తన మాటలతో, ఛలోక్తులతో, సరదా పంచ్‌లతో చుట్టూ ఉన్నవారిని ఇట్టే ఆకర్షిస్తారు. ఆయన ఎక్కడ మాట్లాడిన మ్యాటర్‌లో సీరియస్‌నెస్, చేతల్లో సీరియస్‌నెస్‌తో పాటు.. చాలా సరదా సన్నివేశాలు కూడా ఉంటాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. తన కెరీర్ గురించి, తన తల్లిదండ్రులు ఏం కల కన్నారు? అసలు తాను ఏం అవ్వాలనుకున్నారు? ఏం అయ్యారో వివరిస్తూ చాలా ఫన్నీ వెదర్ క్రియేట్ చేశారు. 'అమ్మ ఏమో నన్ను డాక్టర్‌గా చూడాలనుకుంది. నాన్న ఏమో కలెక్టర్‌గా చూడాలనుకున్నారు.. నేనేమో రాజకీయ నాయకుడిని అయిపోయా.' అంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసి సభికుల్లో నవ్వులు పూయించారు. మరి ఇంతకీ ఈ కామెంట్స్‌ను మంత్రి కేటీఆర్‌ ఎక్కడ అన్నారు? ఏ సందర్భంలో అన్నారు? ఇంకా ఏం మాట్లాడారు? పూర్తి వివరాలు మీకోసం..

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు వర్చువల్‌గా ప్రారంభించారు. సిరిసిల్ల వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. '1993 ప్రాంతంలో తాను ఇంటర్మీడియట్ బైపీసీతో పాసయ్యాను. ఎంసెట్ రాస్తే 1,600 ర్యాంక్ వచ్చింది. అయినా నాకు మెడిసిన్ రాలేదు. ఆ టైమ్‌లో అమ్మ నన్ను డాక్టర్ చేయాలని భావించింది. నానేమో ఐఏఎస్ ప్రిపేర్ కమ్మని ప్రోత్సహించారు. నేనేమో రాజకీయ నాయకున్ని అయిపోయా' అంటూ ఆసక్తికర వివరాలు పంచుకున్నారు మంత్రి కేటీఆర్‌.

అయితే, వైద్య కళాశాలలో సీట్ రావడం చాలా కష్టమైన రోజులని, నాటి రోజులను ఉదహరించారు మంత్రి కేటీఆర్. కానీ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అనేక వైద్యశాలలు, వైద్య కళాశాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి పదివేల మంది వైద్యులను తయారు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
దేశంలో ఉన్న వైద్యుల్లో అత్యధిక శాతం తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతతో విద్య, వైద్యానికి, ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Also Read:

Rajinikanth: చంద్రబాబును పరామర్శించేందుకు రాజమండ్రికి రజనీకాంత్

Advertisment
Advertisment
తాజా కథనాలు