KTR: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్‌ రియాక్షన్.. బాధనిపించిందంటూ..

చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్ ట్వీట్ చూసి బాధనిపించిందన్నారు. చంద్రబాబుకు భౌతికంగా థ్రెట్ ఉందని లోకేష్ ట్వీట్ చేశారన్నారు. అదే నిజమైతే చాలా దురదృష్టకరమన్నారు కేటీఆర్.

New Update
Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాదం బాధితులకు రూ.5 లక్షల పరిహారం: మంత్రి కేటీఆర్‌

స్కిల్ డవలప్మెంట్ కేసులో (Skill Development Case) అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్ (Nara Lokesh) ట్వీట్ చూసి బాధనిపించిందన్నారు. చంద్రబాబుకు భౌతికంగా థ్రెట్ ఉందని లోకేష్ ట్వీట్ చేశారన్నారు. అదే నిజమైతే చాలా దురదృష్టకరమన్నారు కేటీఆర్. ఇది ఏపీలోని రెండు పార్టీల వ్యవహరమన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. హైదరాబాద్ శాంతియుతంగా ఉండాలన్నదే తన తపన అని అన్నారు.
ఇది కూడా చదవండి: Minister KTR: గజ్వేల్‌లో ఈటల పోటీపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ఇదిలా ఉంటే.. గతంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌తో మాకేం సంబంధం అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన వాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ర్యాలీలు, ధర్నాలు చేస్తే ఏపీలో చేయాలి కానీ.. తెలంగాణలో చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎవరైనా పోటీ ర్యాలీలు చేస్తే తాము ఏం చేయాలని ప్రశ్నించారు. లోకేష్‌ ఫోన్‌ చేసి ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదంటని అడిగారని చెప్పారు కేటీఆర్. ఫ్రెండ్‌ ద్వారా ఫోన్‌ చేయించారన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పక్కింట్లో పంచాయితీని ఇక్కడ తేల్చుకోవడం ఏంటని చంద్రబాబు అరెస్టును ఉద్ధేశించి వాఖ్యానించారు.

ఈ విషయమై రాజమండ్రి, విజయవాడ, అమరావతిలో తేల్చుకోవాలని సూచించారు. ఏపీలోని రెండు ప్రధాన పార్టీలకు తెలంగాణలో ఉనికి లేదన్నారు. చంద్రబాబు తనపై కేసుల విషయంలో న్యాయపోరాటం చేస్తున్నారని.. ఈ విషయమై కోర్టుల్లోనే ఏదో ఒకటి తేలుతుందన్నారు. తనకు లోకేష్‌, జగన్‌, పవన్‌ ముగ్గురూ ఫ్రెండ్సే అని కేటీఆర్ అన్నారు. తనకు ఏపీతో ఎలాంటి పంచాయితీ లేదని స్పష్టం చేశారు కేటీఆర్.

Advertisment
తాజా కథనాలు