Telangana: పట్టణంలో ఉండి కూడా ప్రభుత్వ పథకాలకు అప్లే చేసుకోవచ్చు..! తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలకు అప్లై చేసుకోవడానికి పట్టణ వాసులు తమ గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పట్టణంలో ఉండి కూడా అప్లై చేసుకోవచ్చు. లబ్ధిదారుల దరఖాస్తుల ఫామ్‌లను బంధులు ఇచ్చినా తీసుకుంటారు. ఆధార్, రేషన్ కార్డ్ సహా అవసరమైన డ్యాక్యూమెంట్స్ ఇస్తే సరిపోతుంది. By Shiva.K 28 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana 6 Guarantee schemes: తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా 6 గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. గురువారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పథకానికి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, చాలా మంది ప్రజలు ఉపాధి నిమిత్తం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చారు. ఇప్పుడు వీరిలో టెన్షన్ మొదలైంది. ఈ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలంటే ఊరెళ్లాలని భావిస్తున్నారు. ఓవైపు పని చేసే చోట సెలవులు దొరక్క.. మరోవైపు బస్సులు దొరక్క ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాలు వలస పోయిన ప్రజల కోసం ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రజాపాలన: అభయ హస్తం గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లు గ్రామపంచాయతీ మరియు పట్టణ వార్డు కార్యాలయాలలో ఉచితంగా లభించును. ప్రజలు ఎవరూ కూడా అధిక రుసుముతో ఫాంలను కొని మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వం పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కావున ప్రజలు… pic.twitter.com/x5CeEuiiSS — Telangana Congress (@INCTelangana) December 28, 2023 పట్టణాల్లో నివసించే ప్రజలు గ్రామాలకు వెళ్లి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఊళ్లలో బంధువులు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటారని చెబుతున్నారు అధికారులు. లబ్ధిదారులు స్వయంగా దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. గ్రామాల్లో వారి తరఫున బంధువులు ఎవరైనా అప్లై చేయవచ్చంటున్నారు అధికారులు. లబ్ధిదారులు తమ ఆధార్, రేషన్‌కార్డు వివరాలు సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు అధికారులు. కొన్ని చోట్ల అప్లికేషన్లకు డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, రూపాయి కూడా చెల్లించక్కర్లేదని స్పష్టం చేస్తున్నారు అధికారులు. అప్లికేషన్ ఫారంలను ఎవరైనా అమ్మితే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. కాగా, లబ్ధిదారులు పలు చోట్ల దరఖాస్తులు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు కలర్ జీరాక్స్‌లు తీసుకెళ్తే అధికారులు ఒప్పుకోలేదు. ప్రజా పాలన: ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫాంలో వివరాలు ఎలా నింపాలి, ఏయే పత్రాలు కావాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.#PrajaPalana pic.twitter.com/q7BgBCvrJB — Telangana Congress (@INCTelangana) December 27, 2023 Also Read: సీఎం జగన్‌తో అంబటి రాయుడు భేటీ.. ఆ సీటు కన్ఫామ్ అయినట్లేనా?! మేడం కాదు.. సీతక్క అని పిలవండి.. అధికారులకు మంత్రి సూచన.. #telangana-government #telangana-6-guarantee-schemes #praja-palana-scheme మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి