PV Sindhu meets Amit Shah: అమిత్‌షాతో పాటు కిషన్‌రెడ్డిని కలిసిన బ్యాడ్మింటర్‌ స్టార్‌ పీవీ సింధు!

పీవీ సింధు నిబద్ధత, కృషి, అంకితభావం యువ తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రశంసల వర్షం కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. రేపు(సెప్టెంబర్ 17) హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన అమితి షా ఈ బ్యాడ్మింటన్‌ స్టార్‌ని కలిశారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోనూ పీవీ సింధు భేటీ అవ్వడం చర్చనీయాంశమవుతోంది.

New Update
PV Sindhu meets Amit Shah: అమిత్‌షాతో పాటు కిషన్‌రెడ్డిని కలిసిన బ్యాడ్మింటర్‌ స్టార్‌ పీవీ సింధు!

ఏడాది కాలంగా తెలుగునాట ప్రముఖులను కలుస్తూ..వారితో భేటీ అవుతోంది బీజేపీ. ఇప్పటికే జూనియర్‌ ఎన్టీఆర్‌ లాంటి టాప్‌ హీరోలతో మీటింగ్‌ పెట్టిన కేంద్ర బీజేపీ పెద్దలు తాజాగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్ పీవీ సింధుతో భేటీ అయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పీవీ సింధు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోనూ పీవీ సింధు భేటీ అవ్వడం చర్చనీయాంశమవుతోంది. పీవీ సింధు బీజేపీలో చేరుతారా లేదా సెలబ్రెటీలను కలిసే క్రమంలోనే జరిగిన సాధారణ భేటీనా అన్న విషయంపై పలువురు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు.


సింధుపై ప్రశంసలు:
పీవీ సింధుపై అమిత్‌షా ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె అసాధారణమైన క్రీడా ప్రతిభకు అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నందుకు దేశం గర్విస్తుందన్నారు. రేపు(సెప్టెంబర్ 17) హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు షా హైదరాబాద్ వచ్చారు. 'ఈరోజు హైదరాబాద్‌లో ఏస్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును కలిశాను. ఆమె అసాధారణమైన క్రీడా ప్రతిభకు లభించిన అంతర్జాతీయ ప్రశంసల పట్ల దేశం గర్విస్తోంది' అని షా ట్విట్టర్‌లో పోస్ట్‌లో చేశారు. 'ఆమె నిబద్ధత, కృషి, అంకితభావం యువ తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయి' అని అన్నారు.

publive-image కిషన్ రెడ్డితో పీవీ సింధు భేటీ

మరోవైపు ఇటివలి కాలంలో బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో పీవీ సింధు ర్యాంక్‌ పడిపోయింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో 14వ స్థానానికి పడిపోయింది సింధు. అయితే కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన సింధు పుంజుకుంటుందని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. రెండు రజత పతకాలు (2017, 2018), ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ (2019)లో స్వర్ణ పతకం, 2018 ఆసియా క్రీడల్లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం లాంటి ఎన్నో విజయాలు ఈ భారత షటిల్ క్వీన్‌ ఖాతాలో ఉన్నాయి. 2022లో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించింది సింధు.

ALSO READ: రజాకార్లపై పోరాటానికి ముందు పాక్‌ ప్రధానికి నెహ్రు టెలిగ్రామ్‌.. నిజాం పీడ వదిలిన రోజు!

Advertisment
తాజా కథనాలు