CM Revanth Reddy : హరీష్ రావును ఓడించి తీరుతాం.. రేవంత్ సంచలన సవాల్!

ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతుల రుణాలు మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాటకు హరీశ్ రావు కట్టబడి ఉండాలన్నారు. ఆయన రాజీనామా చేస్తే ఓడించి తీరుతామన్నారు. పథకాలు, ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు.

CM Revanth Reddy : హరీష్ రావును ఓడించి తీరుతాం.. రేవంత్ సంచలన సవాల్!
New Update

అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు తిరగకుండానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఖమ్మం జిల్లాలో మూడో విడత రైతు రుణమాఫీ నిధులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.31 వేల కోట్లతో రైతులను రుణ విముక్తులను చేశామన్నారు. పంద్రాగస్టులోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఆనాడు మాట ఇచ్చామన్నారు. రైతాంగానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కంకణం కట్టుకున్నామన్నారు. 27 రోజుల్లో రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏకైక ప్రభుత్వం తమదన్నారు. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు ఆనాడు సవాల్ చేశారని గుర్తు చేశారు.

publive-image

హరీష్‌ రావుకు చీము, నెత్తురు ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చేయకపోతే అమర వీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి.. తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. హరీష్ రాజీనామా చేస్తే.. ఉప ఎన్నికలో ఓడించి తీరుతామన్నారు. తమది మాట తప్పని, మడమ తిప్పని ప్రభుత్వమన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది నియోజకవర్గానికి 3500 చొప్పున 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చినా.. 7 చోట్ల డిపాజిట్లు పోయినా ఇంకా బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలేదన్నారు.

అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఏడాదిలోగా 65 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేసిందన్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు మిగిలింది గాడిద గుడ్డేనన్నారు. వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై ఏ సెంటర్ లోనైనా చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. హరీష్, కేటీఆర్ ఎవరు వస్తారో రావాలన్నారు.

Also Read : రైతులకు ఇక వడ్డీ భారం ఉండదు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం !

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe