Khammam: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ తప్పనిసరిగా మారింది. ప్రజలు ఎక్కువ సమయం మొబైల్‌లోనే గడుపుతున్నారు. నిద్ర లేవగానే మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్‌తోనే ఉంటున్నారు. అయితే, ఫోన్ ఎక్కువుగా వాడటం ప్రమాదకరం అని జనాలకు తెలిసినా కూడా ఫోన్ ను వాడకుండా ఉండలేరు. ఫోన్ మాట్లాడే సమయంలో, యూజ్ చేసే సమయంలో ఏం చేస్తున్నామో కూడా గుర్తించలేరు. అలా కొందరు అజాగ్రత్తగా ఉంటూ ప్రాణాలు కూడా కోల్పుతున్న సంఘటనలు ఎన్నో చూశాం. ఫోన్ ధ్యాసలో పడి ఒక వ్యక్తి ప్రాణాలే కోల్పోయాడు
Also Read: ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి
తాజాగా, ఫోన్ ధ్యాసలో పడి ఓ కొబ్బరికాయల వ్యాపారి తన ప్రాణాలే కోల్పోయాడు. అసలేం జరిగిందంటే.. ఖమ్మంలో కొబ్బరికాయల వ్యాపారి మహేష్ బాబు తన పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వాటర్ హీటర్ పెట్టాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే, ఇలోపే అతడికి ఫోన్ రావడంతో మాట్లాడుతూ హీటర్‌ను చంకలో పెట్టుకున్నాడు. దీంతో కరెంట్ షాక్ తగిలి మహేష్ సృహ కోల్పోయాడు.
Also Read: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. హిందూ మైనార్టీల భారీ ప్రదర్శన
వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యలు హుటాహుటినా మహేష్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తన భర్త ఆకస్మిక మరణంతో భార్య దుర్గాదేవి, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు మహేష్ బాబుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.