కడియం శ్రీహరిపై, ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు ఎన్కౌంటర్ల సృష్టికర్త అంటూ ఫైర్‌ అయ్యారు. కులం ఆత్మగౌరవంతో సమానం. కుల ప్రస్తావన జరగాలి పార్టీ నుండి బహిష్కరించిన వారే కడియం శ్రీవారి వెంట ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో నియోజకవర్గంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

కడియం శ్రీహరిపై, ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు
New Update

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారం కోసం గులాబీ బాస్ కలలు కంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెండు దఫాలుగా అధికారాన్ని కొనసాగిస్తున్న టిఆర్ఎస్ పార్టీ మూడవ దఫా కూడా గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తుంటే పార్టీ నేతలు మాత్రం అంతర్గత కలహాలను వదిలిపెట్టటం లేదు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్దం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరి ఆధిపత్య పోరు, టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి తాటికొండ రాజయ్యల మధ్య పంచాయితీ పీక్స్ కి చేరుకుంది.

బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం

జనగామ జిల్లాలో మళ్లీ బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అంటూ ఫైర్‌ అయ్యారు. కులం ఆత్మగౌరవంతో సమానం. కుల ప్రస్తావన జరగాలి పార్టీ నుండి బహిష్కరించిన వారే కడియం శ్రీవారి వెంట ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నియోజకవర్గ ప్రజలు నా వెంట ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని స్టేషన్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కోరారు.

ఎమ్మెల్సీపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రకు చెందిన దూదేకుల వ్యక్తిని పెళ్లి చేసుకున్న కడియం శ్రీహరి కూతురు ఎస్సీ కాదు, బిసి-బి కులానికి చెందుతుంది. ఆడియోలు, వీడియోలు అంటూ నాపై వస్తున్న ఆరోపణలను కోర్టు ద్వారా ఎదుర్కొంటా నియోజకవర్గంలో 85 వేల ఎస్సీ ఓట్లు ఉంటే 68వేల ఓట్లు నికార్సైన మాదిగలవే అంటూ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. దీంతో రాజకీయంగా సంచలనంగా మారాయి. ఇప్పటికే అనేకసార్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ల మధ్య పంచాయితీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, తాజాగా మరొకమారు ఇరువురు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు తనను ఉద్దేశించే అని భావించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం శ్రీహరికి ఇండైరెక్ట్ గానే కౌంటర్ వేశారు.

స్టేషన్ ఘనపూర్ లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోమారు కడియం శ్రీహరి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్ళీ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య అన్నట్టుగా సాగుతున్న రాజకీయాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. స్టేషన్ ఘనపూర్ లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు తన్నుకుంటున్న తీరు అక్కడ వారిని విస్మయానికి గురిచేస్తుంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లో ప్రత్యర్థి పార్టీల నేతలు బలంగా లేకపోవడంతో సొంత పార్టీల నేతలే బలంగా తన్నుకుంటున్న పరిస్థితి ఉందని చర్చ జరుగుతుంది . పోటాపోటీగా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వర్గాలు నియోజకవర్గంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయడం మరోమారు చర్చనీయాంశంగా మారుతోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe