TS Inter Exams Schedule 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఫిబ్రవరి 28 నుంచి రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్.. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 28న ప్రారంభమై.. మార్చి 13న ముగియనున్నాయి. సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 14 వరకు నిర్వహించనున్నారు.
ఫస్ట్ ఇయర్ పరీక్షల తేదీలు:
- ఫిబ్రవరి 28: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1.
-మార్చి 1: ఇంగ్లీష్ పేపర్ 1
-మార్చి 4: మాథ్స్ పేపర్ 1A/ బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్ 1
-మార్చి 6: మాథ్స్ పేపర్ 1b/ జువాలజి పేపర్ 1/ హిస్టరీ పేపర్ 1
-మార్చి 11: ఫిజిక్స్ పేపర్ 1/ ఎకనామిక్స్ పేపర్1
-మార్చి 13: కెమిస్ట్రీ పేపర్ 1/ కామర్స్ పేపర్ 1
సెకండియర్ పరీక్షల తేదీలు:
-ఫిబ్రవరి 29: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
-మార్చి 2: ఇంగ్లీష్ పేపర్ 2
-మార్చి 5: మాథ్స్ పేపర్ 2A/ బాటనీ పేపర్ 2/ పొలిటికల్ సైన్స్ 2
-మార్చి 7: మాథ్స్ పేపర్ 2B/ జువాలాజీ పేపర్ 2/ హిస్టరీ పేపర్ 2
-మార్చి 12: ఫిజిక్స్ పేపర్2/ఎకనామిక్స్ పేపర్ 2
-మార్చి 14: కెమిస్ట్రీ పేపర్ 2/ కామర్స్ పేపర్ 2
ఇంటర్ పరీక్షల తేదీలు విడుదలైన నేపథ్యంలో మరో ఒకటి లేదా రెండు రోజుల్లో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.