TS Crime News: తెలంగాణలో పారుతున్న నెత్తురు.. ఒకే రోజు ఐదు హత్యలు.. ఇంకెన్నో దారుణాలు!

హైదరాబాద్ లో గడిచిన 24 గంటల్లో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు చోటు చోసుకోవడంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిత్యం ఎక్కడో చోట హత్యలు, హత్యాచార ఘటనలు జరుగుతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

New Update
TS Crime News: తెలంగాణలో పారుతున్న నెత్తురు.. ఒకే రోజు ఐదు హత్యలు.. ఇంకెన్నో దారుణాలు!

తెలంగాణలో క్రైమ్ రేట్ ఒకే సారి పెరిగిపోయింది. వరుస హత్యలు, అత్యాచార ఘటనలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే అఘాయిత్యం, లంచం కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ మహా నగరంలో గడిచిన 24 గంటల్లోనే 5 హత్యలు, 2 హత్యాయత్నాలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.

హైదరాబాద్ లో గత 24 గంటల్లో చోటు చేసుకున్న దారుణాల లిస్ట్..
1.సనత్ నగర్ PS పరిధిలోని భరత్ నగర్ లో అజార్ అనే వ్యక్తి దారుణ హత్య
2.సికింద్రాబాద్ పరిధి తుకారం గేట్ పీఎస్ లిమిల్స్ లోని అడ్డగుట్టలో భార్య రోజాను చంపి పరారైన భర్త
3.పాత బస్తీ శాలిబండ పీఎస్ పరిధిలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ యజమాని రఫీక్ మర్డర్
4.అసిఫ్ నగర్ లో అలీం అనే వ్యక్తి హత్య
5.కాచిగూడ PS పరిధిలో ఖిజార్ అనే మరో వ్యక్తి హత్య
6.శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో వజీద్, ఫకృద్దీన్ అనే వ్యక్తులపై మర్డర్ అటెంప్ట్

ఇటీవల జరిగిన నేరాలు
- బాలపూర్ లో ముబారక్ సిగార్ అనే వ్యక్తిని వెంటాడి మరీ హత్య చేసిన దుండగులు
- కొత్తపేటలో ఇంటి ముందు న్యూసెన్స్ చేయొద్దన్నందుకు ఓనర్ పై గంజాయి బ్యాచ్ దాడి
- బంజారాహిల్స్ చర్చ్ లో పని చేసే వారిపై నీళ్లు లేవు అన్నందుకు దారుణ దాడి

బాలికలపై వరుస దారుణాలు..
మియాపూర్ లో 12 ఏళ్ల కన్న కూతురుపై లైంగిక దాడికి యత్నించి ఒప్పుకోకపోవడంతో హత్య చేసిన తండ్రి
పెద్దపల్లి జిల్లాలో ఆరెళ్ల బాలికపై అత్యాచారం
నారాయణ్ పేట్ లో పొలం తగాదాల్లో ఓ వ్యక్తిని కొట్టి చంపిన సోదరులు.. పోలీసులు సమయానికి రాకపోవడంతోనే ఈ హత్య జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

అవినీతికి మరిగిన పోలీసులు:
ఓ వైపు రాష్ట్రంలో వరుస దారుణాలు జరుగుతుంటుంటే.. పోలీసులు మాత్రం అవినీతి మత్తులో మునిగిపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు, సీఐ సుధాకర్, కుషాయి గూడ సీఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ ఇటీవల ఏసీబీకి చిక్కడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. మరో వైపు మహిళా సిబ్బందిపై కాళేశ్వరం ఎస్ఐ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన నిన్న రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో సీరియస్ అయిన ప్రభుత్వం అతడిని సర్వీస్ నుంచి తొలగించింది.

Advertisment
తాజా కథనాలు