దుర్గం చెరువులో దూకి మైనర్‌ బాలిక ఆత్మహత్య, ప్రేమ వ్యవహారమే కారణమా..?

మారుతున్న జీవన పరిస్థితుల కారణంగా నేటితరం యువత మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. చిన్నచిన్న విషయాలకే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ప్రేమ పేరుతో రకరకాల కారణాల వల్ల యువతీ,యువకులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రేమలో పడి.. కొన్ని రోజుల క్రితం పరిచయమైన వారి కోసం కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

దుర్గం చెరువులో దూకి మైనర్‌ బాలిక ఆత్మహత్య, ప్రేమ వ్యవహారమే కారణమా..?
New Update

telangana-hyderabad-a-minor-girl-committed-suicide-cable-bridge-minor-girl-jumped-into-durgam-pond-cable-bridge

ప్రస్తుతం యువత చిన్నపాటి కారణాలతో క్షణికావేశంలో చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చిన్న అపజయాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రేమ విఫలమైందని ఒకరు.. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని మరొకరు.. అప్పులు పెరిగిపోయాయని, భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వచ్చాయని, కుటుంబంలో సమస్యలను తట్టుకోలేక ఇలా చాలామంది తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్నవారిని విషాదంలో నెట్టేస్తున్నారు.

telangana-hyderabad-a-minor-girl-committed-suicide-cable-bridge-minor-girl-jumped-into-durgam-pond-cable-bridge

ముఖ్యంగా యువత తెలిసీ.. తెలియని వయసు.. చిన్న సమస్య వచ్చినా ఎదుర్కొలేని పరిస్థితి. ఏదైనా కష్టం వస్తే చాలు.. చావే శరణ్యమని అనుకుంటున్నారు. ఇలా చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు.. కన్నవారికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ప్రేమించిన వ్యక్తి మోసం చేశారని ఇంకొకరు ఇలా అనునిత్యం ఏదో ఒక కారణంతో.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని వివాహం మాడిందనో.. పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదనో.. ఇలా రకరకాల కారణాల వల్ల యువతీయువకులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్​లో చోటుచేసుకుంది. మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన పాయల్‌గా పోలీసులు గుర్తించారు. నాలుగు నెలల క్రితం పాయల్ హైదరాబాద్‌కు వచ్చింది. ఈరోజు స్నేహితురాలితో కలిసి తీగల వంతెనపై నడుస్తూ పాయల్ ఒక్కసారిగా పైనుంచి చెరువులోకి దూకింది. ఈ క్రమంలోనే ఆమె స్నేహితురాలు తనని ఆపే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది.

ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న పాయల్ స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహం కోసం డీఆర్ఎఫ్‌ బృందాలు, దుర్గం చెరువు లేక్ పోలీసులతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ వ్యవహారం విషయంలో యువతి తల్లిదండ్రులు ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పాయల్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో వివిధ కారణాలతో తీగల వంతెన పైనుంచి దూకి దాదాపు ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఇలా ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీశామని డీఆర్ఎఫ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శౌకత్‌ పేర్కొన్నారు. రాష్ట్రానికి ఐకాన్​గా ఉన్న దుర్గం చెరువు తీగలవంతెన ఆత్మహత్యలకు అడ్డాగా మారడం పట్ల సందర్శకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని విజిటర్స్‌ కోరారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe