Harish Rao-Mynampalli: సిద్దిపేటలో హైటెన్షన్.. మైనంపల్లి Vs హరీష్ రావు! కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఈ రోజు సిద్దిపేటలో పర్యటించనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రుణమాఫీపై సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పట్టణంలో ఎప్పడు ఏం జరుగుతుందోన్న టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. By Nikhil 20 Aug 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు మధ్య మరో సారి పొలిటికల్ వార్ నెలకొంది. హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన సమయంలో హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సిద్దిపేటకు వస్తా.. హరీష్ రావును అక్కడ ఓడించడమే నెక్స్ట్ నా టార్గెట్ అంటూ ఆయన ఆ సమయంలో వ్యాఖ్యానించారు. రుణమాఫీ విషయంలో హరీష్ రావుకు వ్యతిరేకంగా మైనంపల్లి సొంత నియోజకవర్గం మల్కాజ్ గిరిలో ఇటీవల ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో సోషల్ మీడియాలో హరీష్ రావు అనుచరులు మైనంపల్లిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు మైనంపల్లి సిద్దిపేటలో పర్యటించనున్నారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోన్న టెన్షన్ నెలకొంది. ఇటీవల సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది మైనంపల్లి కుమారుడు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు పనే అని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. భారీ నిరసన ర్యాలీ సైతం చేపట్టారు. దీంతో ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక అంబేద్కర్ చౌక్ లో మైనంపల్లి హన్మంతరావు ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు మీటింగ్ ఏర్పాటు చేశారు. రుణమాఫీ అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సమావేశాలతో సిద్దిపేటలో పొలిటికల్ హీట్ నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరుపార్టీల సమావేశాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి