Sirpurkar Commission: దిశా కేసులో సిర్పూర్కర్‌ కమిషన్ నివేదికపై స్టే

TG: దిశా కేసులో సిర్పూర్కర్‌ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్టే విధించింది తెలంగాణ హైకోర్టు. కాగా ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పుబడుతూ ఏడుగురు పోలీస్ అధికారులు హైకోర్టు ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు పోలీసులు, షాద్‌నగర్‌ తహసీల్దార్‌పై చర్యలు వద్దంటూ హైకోర్టు ఆదేశం ఇచ్చింది.

New Update
Sirpurkar Commission: దిశా కేసులో సిర్పూర్కర్‌ కమిషన్ నివేదికపై స్టే

Sirpurkar Commission: సిర్పూర్కర్‌ కమిషన్ నివేదిక దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసులకు ఊరట లభించింది. సిర్పూర్‌కర్‌ కమిషన్‌ నివేదికపై హైకోర్టును ఆశ్రయించారు ఏడుగురు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులు, షాద్‌నగర్‌ తహసీల్దార్‌పై చర్యలు వద్దంటూ హైకోర్టు ఆదేశం ఇచ్చింది. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్‌ కమిషనన్‌ వేసిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో పర్యటించి పలువురిని విచారించిన సిర్పూర్కర్‌ కమిషన్‌.. ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై క్రిమినల్‌ చర్యలకు సూచించింది. పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని కోరింది. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక సరిగ్గా లేదని హైకోర్టుకు వెళ్లారు పోలీసులు.

సిర్పూర్కర్‌ కమిషన్ నివేదికలో ఏముంది?

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమే అని సిర్పూర్కర్ కమిషన్ నివేదిక తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కమిషన్ న్యాయవాది.. వాద ప్రతివాదులకు కమిషన్ రిపోర్ట్ అందజేశారు. 387 పేజీలతో కూడిన ఈ నివేదికలో కీలక విషయాలను వెల్లడించారు. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకే నిందితులను కాల్చి చంపారని సంచలన విషయాన్ని సిర్పూర్కర్‌ కమిషన్ సభ్యులు చెప్పారు. తక్షణ న్యాయం కోసమే పోలీసులు ఈ ఎన్‌కౌంటర్ చేశారని అని స్పష్టం చేశారు.

విచారణ పేరుతో నిందితులను అధికారులు వేధించినట్లు తెలిపింది. పోలీస్ మాన్యవల్‌కు విరుద్దంగా విచారణ జరిగిందని చెప్పారు. నిందితులు కస్టడీలో ఉన్నప్పటి నుంచి కేసు నమోదు చేసిన అధికారులు కాకుండా… వేరే వింగ్ అధికారులు వెంబడే ఉన్నారని తెలిపారు. స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్స్‌, గ్రేహౌండ్స్‌ పోలీసులు నిందితులు విచారణలో పాల్గొన్నారని కమిషన్‌ నివేదికలో స్పష్టం చేసింది. ఎదురుకాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యం లేదని కమిషన్ తేల్చి చెప్పింది.

పోలీసులపై హత్యా నేరం కింద విచారణ జరపాలని సిర్పూర్కర్ కమిషన్ తెలిపింది. పోలీసులు వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మాధర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు ఎస్.అర్వింద్ గౌడ్, డి.జానకిరాం, ఆర్.బాలూ రాఠోడ్, డి.శ్రీకాంత్‌పై విచారణ చేపట్టాలని కమిషన్‌ సూచించింది. ఈ పది మంది పోలీసులపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్షన్ల కింద విచారణ జరపాలని నివేదికలో స్పష్టం చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు