BREAKING: GHMC కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు నోటీసులు

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్‌లో కొండ రాళ్లను పేల్చడం వల్ల తమకు ఇబ్బంది అవుతుందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లను ప్రతి వాదులుగా చేర్చి త్వరలో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.

HMDA: హెచ్ఎండిఏలో బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి
New Update

IAS Amrapali: జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జూబ్లీహిల్స్‌లో కొండ రాళ్లను పేల్చడం వల్ల తమకు ఇబ్బంది అవుతుందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లను ప్రతి వాదులుగా చేర్చి త్వరలో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.

జూబ్లీహిల్స్ నివాస ప్రాంతంలో కొండ రాళ్లను రాత్రి పగలు తేడా లేకుండా పేలుస్తున్నారని, దీంతో ఇబ్బందులు పడుతన్నారని పలు మీడియా లో వార్త కథనాలు వచ్చాయి, దీంతో జడ్జి నగేష్ భీమ పాక ఈ అంశం పై హైకోర్టు CJకి లేఖ రాశారు. దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన కోర్టు.. ఈరోజు బూగర్భ శాఖ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ల తో పాటు హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లను ప్రతి వాదులుగా చేర్చి, ఈ పేలుళ్లపై త్వరలో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.

#amrapali
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe