High Court: ఎమ్మెల్యేల ఫార్టీ ఫిరాయింపులపై తీర్పు రిజర్వు ఈరోజు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్‌ఎస్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 07 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana High Court: ఈరోజు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్‌ఎస్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే.. వారు తమ పార్టీ బీఫామ్ నుంచి గెలిచారని.. వారి ఎన్నికపై అనర్హత వేటు వేసి.. వారి ఎన్నికను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. #telangana-high-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి