Big Breaking: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు బ్రేక్.. కీలక ఆదేశాలు జారీ!

తెలంగాణలో సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డడాయి. తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 27 వరకు ఈ ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. నవంబరర్ 30లోగా ఓటరు లిస్టు తయారు చేయాలని అధికారులను ఆదేశించింది.

New Update
Big Breaking: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు బ్రేక్.. కీలక ఆదేశాలు జారీ!

తెలంగాణలో సింగరేణి ఎన్నికలకు (Singareni Elections) హైకోర్టు బ్రేక్‌ వేసింది. ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశించింది. డిసెంబర్ 27 వరకు ఈ ఎన్నికలను వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు (Telangana High Court). నంబంబర్ 30లోపు ఓటర్ లిస్ట్ తయారు చేయాలని ఆదేశించింది. ఎన్నికలకు సహకరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. వాస్తవానికి ఈ నెల 28న సింగరేణి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. తొలుత హైకోర్టు ఇచ్చిన తీర్పుమేరకు కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. దీనిపై యాజమాన్యం అప్పీల్ కు వెళ్లింది. వరుసగా పండుగలు, అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని యాజమాన్యం కోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ధర్మాసనం కూడా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. మేనేజ్మెంట్ మళ్లీ ఫుల్ బెంచ్ ను ఆశ్రయించింది. దీంతో ఈ రోజు ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు.
ఇది కూడా చదవండి: TS TRT 2023 Exam: టీఆర్టీ కూడా వాయిదా ? లేటెస్ట్ అప్డేట్ ఇదే!

సింగరేణి రాష్ట్రంలోని అనేక జిల్లాలో విస్తరించి ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయా జిల్లాల ముఖ్య అధికారులు కలెక్టర్లు, పోలీసులు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. దీంతో ఈ పరిస్థితుల్లో సింగరేణి ఎన్నికల నిర్వహణ కష్టమని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది యాజమాన్యం. ఈ విషయాలను పరిశీలించి ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు.
ఇది కూడా చదవండి: TELANGANA ELECTIONS:సమరానికి రెడీ అయిపోయిన బీఆర్ఎస్…రంగంలోకి కేసీఆర్

హైకోర్టు డివిజన్ బెంచ్ తాజా తీర్పుతో సింగరేణి ఎన్నికలు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ రద్దు కానుంది. మరోసారి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు