/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Revanth-Reddy-jpg.webp)
మైహోం రామేశ్వర్ రావు వేసిన పరువు నష్టం దావా కేసులో టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (TPCC Chief Revanth Reddy) హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసును కొట్టివేసింది హైకోర్టు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 2014లో మై హోమ్ భుజాకు సంబంధించి భూమి ఆక్రమించారంటూ మైహోం రామేశ్వర్ రావుపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మైహోం సంస్థ భూఆక్రమణలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. దీంతో మైహోం రామేశ్వర్ రావు రేవంత్ రెడ్డి పై రూ.90 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీంతో రేవంత్ రెడ్డి హైకోర్టులో (Telangana High Court) కౌంటర్ కేసు నమోదు చేశారు. రామేశ్వరరావు ఆరోపణలకు ఆధారాలు లేవని భావించిన తెలంగాణ హైకోర్టు ఈ రోజు ఆ కేసును కొట్టివేసింది.