సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలపై హైకోర్టులో విచారణ

తెలంగాణ హైకోర్టు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలపై ఈ రోజు విచారణ జరిపింది. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 4కు వాయిదా వేసింది.

High Court : శంషాబాద్‌లోని 181 ఎకరాలు హెచ్‌ఎండీఏవి.. హైకోర్టు తీర్పు
New Update

ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలపై తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) విచారణ జరిగింది. నేటి నుండి 13 మంది అధికారుల క్యాడర్ కేటాయింపు పై ఒక్కొక్కరి పిటిషన్ పై విచారిస్తామని ఈ సందర్భంగా హైకోర్టు తెలిపింది. సోమేశ్ కుమార్ ఇచ్చిన తీర్పు తమకు వర్తిచ్చాదని బ్యూరో క్రాట్స్ తరఫు న్యాయవాదులు వాదించారు. బ్యూరో క్రాట్స్ కేడర్ కేటాయింపు పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే కేడర్ కేటాయించి 10 సంవత్సరాలు దాటిపోయిందని వ్యాఖ్యానించింది. 10 సంవత్సరాలు పూర్తి అయినా నేపథ్యంలో DOPT ముందు అభ్యర్థన చేసుకోవచ్చని బ్యూరో క్రాట్స్ కు సూచించించింది. 13 మందిలో చాలా మంది పదవీ విరమణకు దగ్గరగా ఉన్నారని తెలిపింది. బ్యూరోక్రాట్స్ న్యాయవాదులు వ్యక్తిగతంగా వాదనలు వినిపిస్తామన్నారు. దీంతో తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 4కు వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: Eatela Rajender: కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే.. ఈటల సంచలన వ్యాఖ్యలు

#high-court
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe