MLA KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్.. హైకోర్టు నోటీసులు TG: కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సిరిసిల్ల నుంచి గెలిచిన కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్, ఈసీకి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. By V.J Reddy 15 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLA KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు, ఈసీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ పిటిషన్లు దాఖలు అయిన నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. సిరిసిల్ల నుంచి గెలిచిన కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు అనే మరో వ్యక్తి హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో కొడుక్కి ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు జడ్జి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు.. పిటిషనర్ అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్, ఈసీకి నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలో 32 ఎకరాలు, శివారు వెంకటాపూర్‌లో మరో 4 ఎకరాలు కొడుకు హిమాన్షు పేరు మీద ఉందని.. కానీ ఎన్నికల అఫిడవిట్‌లో ఆ ఆస్తులను ప్రస్తావించలేదని అభ్యంతరం తెలిపారు. గతేడాదే మేజర్ అయిన కొడుకు హిమాన్షు సొంత డబ్బుతో భూములు కొనే అవకాశం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. అఫిడవిట్‌లో నిజాలు దాచిన కేటీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. #mla-ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి