EX MLA Raghunandan Rao: మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌కు హాజరయ్యారని ఈసీకి రఘునందన్ ఫిర్యాదు చేయగా.. 106 ఐకేపీ, EGS ఉద్యోగులను ఆ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాజాగా వారిని విదుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అసలేమైంది.. ఈ నెల 9వ తేదీన సిద్ధిపేట జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లఘించారని 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు ఆ జిల్లా కలెక్టర్ మను చౌదరి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
ALSO READ: బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
ఫిర్యాదులపై స్పందించిన ఎన్నికల కమిషన్ వారిని వెంటనే విధుల్లో నుంచి తొలిగించాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వగా.. 106 మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఇదే విషయంపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రఘునందన్ రావు రాసిన లేఖపై స్పందించిన ఈసీ ఉద్యోగులను వెంటనే విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చింది.
సస్పెండ్ చేయబడ్డ వారు.. సెర్ప్ ఉద్యోగులు 38 మంది. వారిలో ఏపీఎంలు-14,సీసీలు-18, వివోఏలు-4,సిఓ-1,సిబి ఆడిటర్స్-1. అలాగే 68 మంది ఈజీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఏపీవోలు-4,ఈసీలు -7, టిఏలు-38,సిఓలు-18,ఎఫ్ఎ-1 ఉన్నారు.