TSPSC Group-1: గ్రూప్-1పై టీఎస్పీఎస్సీకి బిగ్ షాక్.. హైకోర్టు సంచలన తీర్పు.. మళ్లీ పరీక్ష! హైకోర్ట్ లో టీఎస్పీఎస్సీకి మరో షాక్ తగిలింది. గ్రూప్ 1 పరీక్షను రద్దుచేయాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. గ్రూప్-1 పరిక్షను మరో సారి నిర్వహించాలని సూచించింది. By Nikhil 27 Sep 2023 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి హైకోర్ట్ లో టీఎస్పీఎస్సీకి (TSPSC) బిగ్ షాక్ తగిలింది. గ్రూప్ 1 పరీక్షను రద్దుచేయాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. గ్రూప్-1 పరీక్షను మరో సారి నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షలో తప్పకుండా బయోమెట్రిక్ అమలుచేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పరీక్షకు హాజరైన దాదాపు 2.30 లక్షల మందిలో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అత్యంత ప్రతిష్టాత్యకంగా నిర్వహించిన ఈ పరీక్ష రెండో సారి కూడా రద్దు కావడంపై టీఎస్పీఎస్సీలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా మూడో సారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పు ప్రకారం పరీక్షను మళ్లీ నిర్వహించాలా? లేదా సుప్రీం కోర్టును ఆశ్రయించాలా? అన్న విషయంపై టీఎస్పీఎస్సీ న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తోంది. ఒక వేళ తీర్పును అమలు చేయాలని భావిస్తే త్వరలోనే కొత్త పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ ప్రకటించే అవకాశం ఉంది. ఒక వేళ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయిస్తే.. తీర్పు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు టీఎస్పీఎస్పీపై కీలక వ్యాఖ్యలు చేసింది. గతేడాది అక్టోబర్ 16న తొలిసారి నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు 2.83 లక్షలు మంది హాజరయ్యారని.. అనంతరం జూన్ 11న రెండో సారి నిర్వహించిన ఎగ్జామ్ కు కేవలం 2.33 లక్షల మంది మాత్రమే హాజరైన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. రెండో సారి 50 వేల మంది అభ్యర్థులు పరీక్షకు దూరం కావడం వ్యవస్థపై నమ్మకం కోల్పోవడమేనని తీవ్ర వాఖ్యలు చేసింది న్యాయస్థానం. మొదటి సారి పరీక్ష నిర్వహించిన సమయంలో 2.85 లక్షల మంది అభ్యర్థుల బయో మెట్రిక్ తీసుకునప్పుడు, రెండో సారి 2.33 లక్షల మందికి ఎందుకు తీసుకోలేకపోయారని ప్రశ్నించింది. ఇది కూడా చదవండి: TS Tet Results 2023: టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే! #tspsc-group-1 #tspsc #telangana-government-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి