TSPSC సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు!

టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఆరుగురు సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ కే.యూ. రిటైర్డ్ ప్రొఫెసర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రభుత్వం ఇష్టం వచ్చినవారిని ఎంపిక చేయడం సరికాదని ధర్మాసనం ఫైర్ అయింది.

TSPSC సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు!
New Update

telangana-high-court-directs-government-to-look-into-tspsc-members-appointment-issue

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుల నియామకంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఆరుగురు సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. TSPSC సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ. వినాయక్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఆరుగురు సభ్యుల అర్హతలు, విశిష్టతలను హైకోర్టు పరిశీలించాలని పిటిషనర్ కోరారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. మూడు నెలల్లో కసరత్తు పూర్తి చేయాలని సూచించింది. ఆరుగురు సభ్యుల నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రశ్న ప్రస్తుత దశలో అవసరం లేదని హైకోర్టు చెప్పింది. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల శక్తి సామర్థ్యాలు ప్రజల్లో విశ్వాసం కలిగించేలా ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది.

  • TSPSC సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు
  • సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వానికి ఆదేశం
  • మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి
  • అప్పటివరకు అమల్లోనే నియామక జీవో
  • సుదీర్ఘ వాదనల తర్వాత 80 పేజీల తీర్పు వెల్లడి

TSPSC సభ్యులను నియమిస్తూ 2021, మే 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 108 జీవో జారీ చేసింది. TSPSC నిబంధనల మేరకు ఆరుగురు సభ్యులకు అర్హతలు, విశిష్టతలు లేవని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత.. TSPSC సభ్యులు.. రమావత్ ధన్ సింగ్, ఆర్.సత్యనారాయణ, సుమిత్ర ఆనంద్ తనోబా, బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి, ఆరవెల్లి చంద్రశేఖర్ నియామకాన్ని పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఏ.వినాయక్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సుదీర్ఘ వాదనల అనంతరం గత ఏడాది డిసెంబరులో తీర్పును వాయిదా వేసింది. దీనిపై తాజాగా 80 పేజీల తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని అధికరణ 316 ప్రకారం.. కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులను నియమించే అధికారం గవర్నరుకు ఉందని, నియామక విధానం లేనంత మాత్రాన ప్రభుత్వం తన విచక్షణాధికారంతో ఇష్టం వచ్చినవారిని ఎంపిక చేయడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe