Big Breaking: తెలంగాణలో మరో సారి గ్రూప్-1 రద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో మరో సారి గ్రూప్-1 పరీక్ష రద్దైంది. జూన్ 11 న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Big Breaking: తెలంగాణలో మరో సారి గ్రూప్-1 రద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు
New Update

తెలంగాణలో మరో సారి గ్రూప్-1 పరీక్ష రద్దైంది. జూన్ 11 న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. పరీక్ష సందర్భంగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయకపోవడంతో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పేపర్ లీకేజీ కారణంగా ఇప్పటికే పరీక్ష ను ఓసారి రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. రద్దు చేసిన పరీక్షను జూన్ 11న నిర్వహించింది. తాజాగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయలేదని పలువురు అభ్యర్థులు ఆశ్రయించడంతో హైకోర్టు మరో సారి పరీక్షను రద్దు చేసింది. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై టీఎస్పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేని నిరుద్యోగుల్లో ఉత్కంఠగా మారింది. కోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తుందా.. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా అన్న అంశం మరో ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది.

తొలుత గతేడాది అక్టోబర్ 16వ తేదీన మొదటి సారిగా నిర్వహించింది టీఎస్పీఎస్సీ. మెయిన్స్ కు ఎంపికైన వారి జాబితాను సైతం విడుదల చేసింది. అయితే.. పేపర్ లీకేజీ వ్యవహారం బయటపడడంతో ఆ పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరీక్షకు మొత్తం 3,80,202 అభ్యర్థులు అప్లై చేసుకోగా.. తొలిసారి అక్టోబర్ 16న నిర్వహించిన ఎగ్జామ్ కు 2,86,051 మంది హాజరయ్యారు.

తొలి సారి నిర్వహించిన గ్రూప్-1 రద్దు కావడంతో జూన్ 11న మరో సారి ప్రిలిమ్స్ ను నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్షకు 2,33,248 మంది హాజరయ్యారు. వీరంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో మరో సారి ఎగ్జామ్ రద్దు కావడం వారిలో ఆందోళన కలిగిస్తోంది. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగానే రెండు సార్లు పరీక్ష రద్దు అయ్యిందని వారు ఆరోపిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్యకంగా నిర్వహించాల్సిన గ్రూప్-1 పరీక్ష విషయంలో టీఎఎస్పీఎస్సీ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe