Telangana: జైలుకెళ్తేనే ఇంటి స్థలం ఇస్తారా.. ఉద్యమకారులకు పథకాలు ఎలా?

తెలంగాణ ప్రభుత్వం అమరవీరులకు కూడా పథకాలు అందివ్వనుంది. ఉద్యమకారులకు, స్వరాష్ట్ర ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు 250 చ.గ స్థలం ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది ప్రభుత్వం.

New Update
Telangana: జైలుకెళ్తేనే ఇంటి స్థలం ఇస్తారా.. ఉద్యమకారులకు పథకాలు ఎలా?

Telangana Govt Schemes: తెలంగాణలో ఇప్పుడంతా ఆరు గ్యారెంటీల అమలుపైనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం అమలు చేయనున్న కీలక పథకాలకు సంబంధించి దరఖాస్తులు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పథకాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు 250 గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయంచింది ప్రభుత్వం. అయితే, ఈ పథకానికి అర్హతగా వారిపై నమోదైన కేసులు వివరాలు, ఎఫ్ఆర్‌ఐ నెంబర్, జైలు వివరాలు, స్టేషన్ వివరాలు దరఖాస్తు ఫారమ్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడిదే పెద్ద చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో ఎవరు ఉద్యమాకరులు అనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. FIRతో పాటు జైలుకు వెళ్లిన వివరాలు అడుగుతోంది ప్రభుత్వం. ఉద్యమ సమయంలో వేల మందిపై కేసులు నమోదు అయ్యాయి. కేసుల కారణంగా కొందరు ఉద్యమకారులు జైలు జీవితాన్ని అనుభవించారు. అయితే, జైలుకెళ్తేనే ఇంటి స్థలం ఇస్తారా..FIR నమోదైనా అమలు చేస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. జైలుకెళ్లని, కేసులు నమోదు కాకుండా కూడా ఎంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మరి వారి సంగతి ఏంటి? అనేది ఇప్పుడు ఉత్పన్నమవుతున్న మరో ప్రశ్న. జైలుకెళ్లిన వారికే ఇంటి స్థలం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దాంతో ఉద్యమకారుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఉద్యమకారులకు పలు హామీలిచ్చింది కాంగ్రెస్. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే, అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు రూ.25 వేల గౌరవ పెన్షన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. మరి వీటిని ఎలా అమలు చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Also Read:

వైసీపీ మరో బిగ్ షాక్.. ‘గుడ్ బై’ చెప్పిన ఎమ్మెల్యే..!

ఆ ప్రచారంపై కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్..

Advertisment
తాజా కథనాలు