/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/TS-Government-Jobs.jpg)
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఆ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిలో మూడేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
🔹చేనేత, జౌళి శాఖలో క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ ఉద్యోగాలు
చేనేత, జౌళి శాఖలో క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ పోస్టులకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు చేనేత, జౌళి శాఖ కమీషనర్ శైలజా రామయ్యర్ తెలియజేశారు.
— Telangana Digital Media Wing (@DigitalMediaTG) July 20, 2024
క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్(22).. మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. IIHT నుంచి చేనేత టెక్నాలజీ (DTH )లో డిప్లొమా హోల్డర్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని శైలజా రామయ్యార్ తెలిపారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను tsht.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందాలని ఆమె సూచించారు.