CM KCR: గుడ్‌న్యూస్.. పింఛన్ పెంచుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ దివ్యాంగులకు శుభవార్త అందించారు. రూ.1000 పింఛన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో 5.20లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం రూ.3,016 ఇస్తున్న సంగతి తెలిసిందే.

New Update
CM KCR: గుడ్‌న్యూస్.. పింఛన్ పెంచుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలు

publive-image

రూ.1000 పింఛన్ పెంపు..

దివ్యాంగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్‌ను రూ.4,016కు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. పెంచిన పింఛన్ జులై నుంచే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం రూ.3,016 పెన్షన్ అందుకుంటున్న వారు ప్రభుత్వం నిర్ణయంతో మరో వెయ్యి రూపాయలు అదనంగా అందుకోనున్నారు. పింఛన్లు పెంచడంపై మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు.

5.20లక్షల మందికి లబ్ధి..

ఇటీవల మంచిర్యాల బహిరంగ సభలో దివ్యాంగుల పింఛన్ పెంపుపై కేసీఆర్ ప్రకటన చేశారు. ఇచ్చిన ప్రకటన మేరకు సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు. పింఛన్ పెంపుపై శనివారం జరిగిన సమావేశంలో మంత్రులతో చర్చించిన అనంతరం వెయ్యి రూపాయిలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంపై దివ్యాంగులు సంతోషం వ్యక్తంచేశారు. పింఛన్ పెంచడంతో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. ప్రస్తుతం రూ.3,016 ఇస్తున్న సంగతి తెలిసిందే. పింఛన్‌ పెంపుతో 5.20 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

డైట్ ఛార్జీలు పెంపు..

మరోవైపు గురుకుల హాస్టళ్లలో ప్రస్తుతం అందిస్తున్న డైట్ ఛార్జీలను పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం వసతులు అందించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. పెరిగిన ఛార్జీలు జులై నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న రూ. 950లు రూ. 1200లకు పెరిగాయి. 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు అందిస్తున్న ఛార్జీలు రూ.1100 నుంచి రూ.1400లకు పెంచారు. ఇక 11వ తరగతి నుంచి పీజీ విద్యార్థులకు అందిస్తున్న రూ.1500 కాస్త రూ.1875లకు పెంచుతూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఇది ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు పెంచకుండా ఇప్పుడే ఎందుకు పెంచారని ప్రశ్నిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు