తెలంగాణలో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం, గురువారం రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.

తెలంగాణలో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు
New Update

publive-image

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం, గురువారం రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

publive-image

సెలవులు ఇవ్వాలని ట్వీట్లు..

ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు జులై 27 వరకు సెలవులు ప్రకటించాలని.. ఆన్‌ లైన్‌ క్లాసుల ద్వారా తరగతులు నిర్వహించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్, సీఎంవో, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, హరీష్‌రావులను ట్యాగ్ చేస్తూ వేలాది ట్వీట్లు చేశారు. దీంతో ప్రభుత్వం రెండు రోజుల పాటు  సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌పై పగబట్టిన వరుణుడు..

మరోవైపు వరుణుడు హైదరాబాద్‌పై పగబట్టినట్లుగా పరిస్థితి మారింది. కొన్నిరోజులుగా వాన కురిపిస్తూనే ఉన్నాడు. దీంతో ఇక వానలు చాలు దేవుడా అని నగరవాసులు వేడుకుంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం చిగురుటాకులా వణికిపోతుంది. ఆఫీసులకు వెళ్లేటప్పుడు, ఇంటికి బయలుదేరే సమయంలోనే వాన పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు రోడ్లపై నిలవడంతో గంటకొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు. ఇక సోమవారం సాయంత్రం కురిసిన వానకు అయితే ఎక్కడిక్కడ వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

publive-image

కిలోమీటర్ దూరానికి గంట సమయం..

కిలోమీటరు దూరం వెళ్లడానికి కూడా గంటకు పైగా సమయం పట్టింది. ఓవైపు వాన.. మరోవైపు ట్రాఫిక్‌తో వాహనదారుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవడానికి పోలీసులు ఆదేశాలు జారీచేశారు.
ఫేజ్ 01 : ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.

ఫేజ్ 02 : ఐకియా నుంచి బయో డైవర్సిటి, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.

ఫేజ్ 03 : ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి అని ఓ ప్రకటనలో తెలిపింది.

వచ్చే మూడు రోజలు పాటు భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగరంలో వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.వాగులు, వంకలు పొంగుతూ చెరువులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe