Big Breaking: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు..

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 11 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిపాలనా విభాగం జీవో జారీ చేసింది. బదిలీ అయిన వారిలో రంగనాథ్, విశ్వప్రసాద్ మరికొందరు ఉన్నారు.

New Update
Telangana: తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ..

Telangana IPS Transferred: తెలంగాణ ప్రభుత్వం వరుసపెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంతకు ముందే పలువురు ఐపీఎస్‌లకు స్థానచలనం ఇచ్చిన సర్కార్.. ఇప్పుడు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. మధ్యాహ్నం 11 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిపాలనా విభాగం జీవో జారీ చేసింది. బదిలీ అయిన వారిలో రంగనాథ్, విశ్వప్రసాద్ మరికొందరు ఉన్నారు.

ప్రభుత్వం బదిలీ చేసిన, పోస్టింగ్స్ ఇచ్చిన అధికారుల వివరాలివే..

👉 హైదరాబాద్‌ ట్రాఫిక్‌ చీఫ్‌గా విశ్వప్రసాద్‌

👉 హైదరాబాద్‌ క్రైమ్‌ చీఫ్‌గా ఏవీ రంగనాథ్

👉 వెస్ట్‌జోన్‌ డీసీపీగా విజయ్‌కుమార్

👉 హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ చీఫ్‌గా జ్యోయల్ డెవిస్‌

👉 నార్త్‌జోన్‌ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని

👉 డీసీపీ డీడీగా శ్వేత

👉 ట్రాఫిక్‌ డీసీపీగా సుబ్బరాయుడు

👉 టాస్క్‌ఫోర్స్ డీసీపీ నిఖితపంత్

👉 సిట్‌ చీఫ్‌ గజారావు భూపాల్‌ను డీజీపీ ఆఫీస్‌కు రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.

అంతకు ఐఏఎస్ అధికారుల బదిలీ..

తెలంగాణ సర్కార్  ఆదివానం 11మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అర్వింద్ కుమార్ పై వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎలక్షన్ కమిషన్‌ బదిలీ చేసిన శ్రీనివాస్‌రాజు, శ్రీదేవికి తిరిగి పోస్టింగ్ ఇచ్చింది.

👉 విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ

👉విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి.వెంకటేశం

👉మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్‌

👉హైదరాబాద్ వాటర్‌వర్క్స్‌ ఎండీగా సుదర్శన్ రెడ్డి

👉వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా శ్రీదేవి

👉మహిళా- శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి అరుణ

👉జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా

👉ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా కర్ణన్‌

👉రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా శ్రీనివాస్ రాజు

👉అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్‌

Also Read:

అమ్మాయిల కోసం రేవంత్ సర్కార్ సరికొత్త పథకం.. అర్హతలివే..

రెండు చోట్ల ఓట్లపై స్పందించిన నాగబాబు.. ఏమన్నారంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు